“వాళ్ల పై పోలీస్ కేసు”..త్రివిక్రమ్ సంచలన నిర్ణయం..!?

ఈ మధ్యకాలంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరుని సోషల్ మీడియాలో ఎలా చీప్ గా వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు .. మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది కొందరు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ జాన్ జిగిడి దోస్త్ త్రివిక్రమ్ కూడా ట్రోల్ చేస్తున్నారు.

పలు అసభ్యకర వ్యాఖ్యలతో మీమ్స్ తో ఆయన పర్సనల్ లైఫ్ ని కూడా నెట్టింట ట్రోల్ చేస్తూ ఉండడంతో త్రివిక్రమ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.. అంతేకాదు త్రివిక్రమ్ అలాంటి వాళ్లపై కేసు పెట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు . కానీ త్రివిక్రమ్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు . ఆయన లాస్ట్ గా తరకెక్కించిన సినిమా గుంటూరు కారం .

మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . త్వరలోనే అల్లు అర్జున్ తో ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాను తెరకెక్కించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు హద్దులు మీరిపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెనుకాడడు అంటూ ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు . ఇకనైనా ఈ ట్రోలింగ్ ఆపేసి కొద్దిగా ఎవరి పని వాళ్ళు చూసుకుంటే అందరికీ బెటర్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు..!!