“ఒక్కసారి అలా చెయ్యి బ్రో”..డార్లింగ్ కు అభిమానులు స్పెషల్ రిక్వెస్ట్..!!

పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ .. ప్రెసెంట్ నటిస్తున్న అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీలే కావడం గమనార్హం. బాహుబలి స్టేటస్ ని అందుకున్న ఈ ఆరడుగుల అందగాడు..వెరీ సైలెంట్. సోషల్ మీడియాలో రెబల్ ఫ్యాన్స్ ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయనకు సంబంధించిన పలు రకాల వీడియోలను ట్రెండ్ చేస్తూ ఉంటారు . రీసెంట్గా ఓ రెబల్ అభిమాని ప్రభాస్ కి సంబంధించిన ఒక వీడియోను చాలా అద్భుతంగా క్రియేట్ చేశాడు . ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది శ్రీదేవి.. వీళ్లిద్దరి కాంబో అప్పుడు సూపర్ సూపర్ హిట్ అయింది . ఈ సినిమా పెద్దగా పాపులారిటీ దక్కించుకోకపోయినప్పటికీ ఈ జంట మాత్రం అభిమానులకు ఫేవరెట్ గా మారింది . అయితే ప్రజెంట్ శ్రీదేవి పలు షోలతో బిజీగా ఉంది. ఆమె కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన పిక్స్ అలాగే ప్రభాస్ మరికొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడిన పిక్స్ లు మ్యాచ్ చేస్తూ ఈశ్వర్ సినిమాలోని కొన్ని రొమాంటిక్ సీన్స్ ని యాడ్ చేస్తూ ఒక అభిమాని అద్భుతమైన వీడియోని క్రియేట్ చేశారు .

ఆ వీడియోకి డార్లింగ్ సినిమా సాంగ్ జోడించారు.. ఇంకేముంది ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ప్రభాస్ అన్న మళ్లీ మీ కాంబో చూడాలని ఉంది ఒక్కసారి శ్రీదేవి గారికి మీ సినిమాలో ఏదో ఒక ఛాన్స్ ఇవ్వు అన్న ప్లీజ్ అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు . చూద్దాం మరి ప్రభాస్ అభిమానుల కోరికలు తీరుస్తాడో లేదో..??