పాపం..చివరి కోరిక తీరకుండానే చనిపోయిన డేనియల్ బాలాజీ ..!

డానియల్ బాలాజీ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. చాలా చిన్న ఏజ్ లోనే గుండెపోటుతో ఆయన మరణించడం అభిమానులకి మింగుడు పడడం లేదు. డానియల్ బాలాజీ మరణ వార్త విని చిత్ర పరిశ్రమ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. కేవలం తమిళ్ సినిమాలే కాదు మలయాళం.. తెలుగు ..కన్నడ సినిమాలలో కూడా నటించి ఆయన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు .

విలనిజానికి పెట్టింది పేరుగా ఆయన పర్ఫామెన్స్ ఉంటుంది . డైలాగ్స్ తో కాదు కంటి చూపుతోనే జనాలకు భయం పుట్టించే ఒక క్రేజీ విలన్ అని చెప్పాలి ..ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వలేదు అని ..ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాక్ అటూఇటూ గా ఉన్న డేనియల్ బాలాజీ పెర్ఫార్మెన్స్ మాత్రం ఓ రేంజ్ లో కుమ్మి పడేస్తూ ఉంటాడు .

డానియల్ బాలాజీ చివరి కోరిక తీరకుండానే చనిపోయాడు అన్న వార్త ఇప్పుడు అభిమానులకు కన్నీరు తెప్పిస్తుంది . మొదటి నుంచి డేనియల్ బాలాజీ విలనిజం కన్నా హీరోగా ఎంట్రీ ఇవ్వడం కన్నా డైరెక్షన్ వైపే ఇంట్రెస్ట్ చూపించే వారట . కానీ ఆయన డైరెక్టర్ గా తన కోరిక తీర్చుకోలేకపోయాడు . ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ గా మారి అవార్డు తీసుకోవాలి అనేది ఆయన కోరికట . కానీ ఆయన ఆ కోరిక తీరకుండానే మరణించేసాడు .. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. డేనియల్ బాలాజీ ఫ్యాన్స్ ఈ న్యూస్ తెలుసుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..!!