సైలెంట్ గా పెళ్లి చేసుకున్న 96 మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. రామ్, జాను.. కానీ అసలు టెస్ట్ ఇదే..?!

ఇటీవల కాలంలో హీరో, హీరోయిన్లు ప్రేమ పెళ్లిళ్లతో పాటు.. పెద్దలు కుదిరిచిన పెళ్లిలను కూడా చాలా సైలెంట్ గా చేసేసుకుంటూ హైలెట్గా నిలుస్తున్నారు. ఏకంగా సిద్ధార్థ్‌, అధితి లాంటి స్టార్ హీరో, హీరోయిన్లు కూడా షూటింగ్ అని రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకొని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు అలాగే మరో జంట పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న.. 96 సినిమా 2018లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాల్లో విజయ్, త్రిష.. చిన్ననాటి పాత్రలో గౌరీ కిషన్, ఆదిత్య నటించారు. జాను, రామ్‌గా వీరు నటించి మెప్పించారు. వీరిద్దరు చేసిన ఈ పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకుల్లో గుర్తుండిపోతాయి. తాజాగా ఈ సినిమాలో జంటగా నటించిన చైల్డ్ ఆర్టిస్టులు గౌరీ, ఆదిత్య ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు గౌరీ కిషన్ కొన్ని ఫోటోలు స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. వారిద్దరిది నిజమైన వివాహమని చాలామంది కంగ్రాట్స్ చెబుతున్న నేపథ్యంలో.. షాక్ ఇచ్చారు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలా చేశారని.. వారు వివరించారు. గౌరీ కిషన్, ఆదిత్య తాజాగా నటించిన హాట్ స్పాట్.. సినిమా విగ్నేష్ కార్తీక్ డైరెక్షన్లో తెర‌కెక్కింది. ఈ సినిమా తమిళ్ ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగానే ఆదిత్య, గౌరీ కిషన్ పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఆ ఫోటోలను చూసినట్లు నిజంగానే ఆదిత్య, గౌరీ.. వివాహం చేసుకున్నారని భావించారు. దీనిపై స్పందించిన మేకర్స్ ఇది నిజమైన వివాహం కాదని.. ప్రమోషన్స్ లో భాగమని వెంటనే క్లారిటీ ఇచ్చారు.