తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటా.. పిల్లలు కావాలిగా.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఫ్యామిలీ స్టార్. సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను ఘనంగా జరుపుతున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగా తాజాగా చెన్నై వెళ్లాక అక్కడ విజయ్‌కు పెళ్లి గురించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

దానిపై రౌడీ హీరో మాట్లాడుతూ.. తప్పకుండా పెళ్లి చేసుకుంటా.. పిల్లలు కూడా కావాలి కదా.. అయితే ఈ ఏడాది చేసుకోను.. అంటూ వివరించాడు. ఇక తాను కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని కన్ఫామ్ చేసినట్లు సమాచారం. ఇక గ‌త‌ కొంతకాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక లవర్స్ అంటూ తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే వారు ప్రైవేట్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ చాలా సార్లు కెమెరా కళ్ళకు చిక్కారు.

దీంతో విజయ్ దేవరకొండ చేసుకోబోయేది రష్మిక అనే అంటూ.. వారిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారని విజయ చెప్పక‌నే చెప్పేసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో పక్కన రష్మిక కూడా ఫ్యామిలీ స్టార్ హిట్ అవడం పక్క డార్లింగ్స్ అంటూ పరుశురాం, విజయ్ దేవరకొండకు ఆల్ ద బెస్ట్ అని ట్యాగ్‌ చేసిన సంగతి తెలిసిందే. తనకు పార్టీ కావాలని విజయ్ దేవరకొండను అడ‌గ‌గా.. రౌడీ హీరో క్యూటెస్ట్‌ అంటూ హాట్ సింబల్ షేర్ చేశాడు.