నితిన్ “తమ్ముడు” పోస్టర్ లో ..ఈ మిస్టేక్ గమనించారా.. నో డౌట్ మళ్లీ భారీ బొక్కే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నితిన్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆయన సినిమాలు ఎలాంటి హిట్ అందుకుంటూ ఉంటాయో మనకు బాగా తెలిసిన విషయమే . ప్రెసెంట్ ఆయన ఒక హిట్ కోసం వేచి చూస్తున్నాడు . ఈ మధ్యకాలంలో నితిన్ హిట్టు కొట్టిందే లేదు ..ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాతో యావరేజ్ అందుకున్నాడు . తాజాగా నితిన్ తన కొత్త సినిమా పోస్టర్ను రిలీజ్ చేశాడు . నేడు నితిన్ పుట్టినరోజు ఆ కారణంగా ఆయన తన నెక్స్ట్ సినిమా పోస్టర్ను రిలీజ్ చేశారు . దిల్ రాజు నిర్మాణంలో వేణు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్క బోతుంది .

ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా “తమ్ముడు” అనే టైటిల్ ని ఫిక్స్ చేశాడు . రిలీజ్ అయిన పోస్టర్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక పాత బస్సు ఆ బస్సును డ్రైవ్ చేస్తూ ఉండే ఒక మహిళా డ్రైవర్ ..అలాగే ప్యాసెంజర్ గా హీరోయిన్ లయ కనిపిస్తుంది. ఇక బస్సు టాప్ పైన చిన్ని గడ్డంతో చేతిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుధం శూలం పట్టుకొని చాలా తీక్షణంగా కనిపిస్తాడు నితిన్ . లుక్స్ పరంగా ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంది . కానీ గతంలో వేణు దర్శకత్వం వహించిన సినిమాల కాన్సెప్ట్స్ చూస్తే ఈ సినిమా కాన్సెప్ట్ కు చాలా డిఫరెంట్ గా ఉంది .

కొత్త జోనర్ ని టచ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి . ఒకవేళ అటూ ఇటూ అయ్యింది అంటే మరో భారీ బొక్క తప్పదు అంటున్నారు జనాలు . అంతేకాదు ఈ సినిమా పోస్టర్ లో నితిన్ కాకుండా ఉమెన్స్ హైలెట్ గా ఉండడం గమనార్హం. నితిన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లుక్స్ పరంగా చాలా ఓల్డ్ గా కనిపించినా తమ్ముడు అనే టైటిల్ను పెట్టడం అభిమానులకి అసలు అర్థం కావడం లేదు . అసలు టైటిల్ కి కాన్సెప్ట్ పోస్టర్ కి ఏ మాత్రం సంబంధం లేదు అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి వేణు ఎలా ఈ సినిమా నీ తెరకెక్కిస్తాడో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో..???