డేనియల్ బాలాజీ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..? బ్రహ్మచారిగా మిగిలిపోవడానికి కారణం ఇదే..!

పెళ్లి అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ .. చాలామంది పెళ్లిని స్కిప్ చేసుకోరు .. తమకంటూ లైఫ్ లో ఒక తోడు ఉండడానికి కచ్చితంగా పెళ్లి చేసుకుంటారు . అయితే కొందరు పెళ్లి అంటే భయపడి పోయి దాన్ని దూరం పెట్టేస్తూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తాడు కోలీవుడ్ స్టార్ విలన్ డేనియల్ బాలాజీ . రీసెంట్గా ఆయన గుండె నొప్పి కారణంగా మరణించిన విషయం తెలిసిందే.

ఈ వార్తతో చిత్ర పరిశ్రమ తీవ్ర శోకసంద్రంలో నిండిపోయింది . అతి చిన్న వయసులోనే ఆయన మరణించడం ఫ్యాన్స్ కి జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ వార్తలను జనాలు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేస్తున్నారు. డేనియల్ బాలాజీ పెళ్లి చేసుకోలేదు .. దానికి కారణం ఆయనకు పెళ్లి అంటే భయం అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు .

“పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనాలి ..వాళ్ళ బాధ్యతలు చూసుకోవాలి .. ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండాలి .. కొన్ని కొన్ని సార్లు మన భార్యా పిల్లల కోసం మనం తప్పు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి ..అలాంటి తప్పు చేసే ఉద్దేశం నాకు లేదు ..అలాంటి బరువు బాధ్యతలు మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా నాకు లేదు.. అందుకే మా అమ్మ నన్ను పెళ్లి చేసుకో అని చెప్పినా కూడా నేను భయం కారణంగా చేసుకొని అని చెప్పేసాను “అంటూ ఇంటర్వ్యూలో మాట్లాడిన న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ చేస్తున్నారు ఆయన అభిమానులు. డేనియల్ బాలాజీ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ ఆయన ఫ్యాన్స్ కుమిలి కుమిలి బాధపడుతున్నారు..!!