సువాసన వెదజల్లే ఈ పండ్ల‌లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయా.. ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!

కెపెల్ ఫ్రూట్ ఇవి మన దేశంలోని కేరళ రాష్ట్రంలో స‌మృధ్ధిగా పండే పంట. ఈ పండ్లు ఎన్నో పోషకాలు క‌లిగి మాన‌వ ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి.
ఈ పండు వాసన బాగుండటమే కాదు.. వీటిని తినడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు క‌లుగుతాయి.కెపెల్ పండు విటమిన్ సి, ఐరన్ , ఫైబ‌ర్‌ను శ‌రీరానికి స‌మృధ్దిగా అందిస్తుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు.. మలబద్ధక స‌మ‌స్య నివారించడానికి.. రక్తపోటును కంట్రోల్ చేయ‌డానికి.. గుండె ఆరోగ్యాన్ని త‌క్షించ‌టానికి సహాయపడుతుంది.

కెపెల్ ఆకులు డయాబెటిస్ నియంత్రణలో కూడా తోడ్ప‌డ‌తాయ‌ట‌. ఈ పండ్ల‌తో మనంజామ్‌ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కెపెల్ ఫ్రూట్‌లో ఉండే పోషకాలు.. దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి తెలుసుకుందాం. కెపెల్ ఫ్రూట్‌లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్‌, విటమిన్ ఎ, మెగ్నీషియం, ఐరన్ లాంటి పోషకాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాక‌రిస్తుంది.

కెపెల్ ఫ్రూట్ లోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్ప‌డ‌తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుచేస్తుంది. కళ్ళ ఆరోగ్యాన్ని స‌హ‌క‌రిస్తుంది. కెపెల్ ఫ్రూట్ ను ఎన్నో ర‌కాలుగా తీసుకోవచ్చు.. తాజా పండ్లు తాపుకొని నేరుగా తిన‌వ‌చ్చు, జ్యూస్ గా, సలాడ్లలో కూడా తీసుకోవచ్చు. కెపెల్ ఫ్రూట్ నుండి తయారైన జామ్, జెల్లీలు కూడా మార్కెట్లో విరివిగా లభిస్తాయి.