మనకు కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచే శరీరానికి అందుతుంది. పోషక విలువలు ఉన్న ఏ రకం ఆహారం మనం తీసుకున్నా అది మన శరీరానికి ఖచ్చితంగా చేస్తుంది. వాటిలో ఇమిడి ఉండే విటమిన్లు, ఖనిజలవణాలు మన శరీరంలో జీవప్రక్రియలు సక్రమంగా జరిగేందుకు సహకరిస్తాయి.
అయితే, ఎన్ని పోషక విలువలు కలిగి ఉన్నా కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఆరోగ్యానికి మేలుచేస్తే.. మరికొన్ని అనారోగ్యానికి దారి తీస్తాయి. అలాంటి ఫుడ్ కాంబినేషన్‌లో పాలతో.. అరటిపండ్లు కలిపి తినడం కూడా ఒకటి. అరటిపండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న పండు అని అందరికి తెలుసు.
అరటిపండులో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, శరీరానికి అవసరమైన అనేక ఇతర పోషకాలు సమృధ్ధిగా ఉంటాయి. పాలు, అరటి పండ్లు ఈ రెండూ మన ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే ఈ రెండింటిని ఒకేసారి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు వివరిస్తున్నారు. అరటిపండ్లను పాలతో కలిపి తింటే కొందరిలో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి అలాంటి వారు ఈ రెండిటిని ఒకేసారి తీసుకోకపోవడమే మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తింటే జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం అన్నంతో పండు తినడం కూడా మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే పండ్లు త్వరగా జీర్ణమవుతాయి.
కానీ తీసుకున్న భోజనం జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుంది. ఇది కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. పాలు.. పుల్లటి పండ్లతో కానీ, అరటితో గానీ తీసుకోకుడదు. బనానా షేక్ అనే ద్రావకాన్ని చాలా మంది ఇష్టంగా తాగుతారు. అయితే ఇది ఆరోగ్యానికి అసలు మంచి కాంబినేషన్ కాదట.పెరుగు, చేపలు తీసుకోవటం కూడా ప్రమాదమే. చేపల్లో ప్రొటీన్లు పుష్కలంగా అభిస్తాయి. పెరుగు తేలికగా డైజెస్ట్ అవుతుంది. కాబట్టి చేపలను పెరుగుతో కలిపి తీసుకోవటం సరైనది కాదు.. మీ జీర్ణవ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇలా తినడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.