తారక్ లాంటి జంటిల్‌మ్యాన్ ను బండ బూతులు తిట్టి మ‌రీ.. షూటింగ్ క్యాన్సిల్ చేసిన స్టార్ డైరెక్టర్.. అస‌లేం జరిగిందంటే..?!

నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. తాత వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఆయ‌న‌.. తాతకు తగ్గ మనవడిగా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు. తారక్ టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ లోనే మాస్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తార‌క్‌.. మొద‌టిలోనే ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ లతో రేసులోదిగాడు. తన పాతికేళ్లకే స్టార్ గా మారిన ఎన్టీఆర్.. బహుముఖ ప్రజ్ఞాశాలి అనడంలో అతిశయోక్తి లేదు.

డ్యాన్స్ తోనూ, నటనతోను, సింగర్ గాను తనదైన రీతిలో పాపులారిటీ దక్కించుకున్న తారక్.. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ఇప్పటికే చాలామంది కొరియోగ్రాఫర్స్‌ స్టేజ్ పై స్వయంగా వివరించారు. ఏదైనా ఒక డ్యాన్స్ స్టెప్ చూస్తే వెంటనే పట్టేస్తాడని.. ఆయనకు డ్యాన్స్ ప్రాక్టీస్ అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే అలాంటి స్టార్ హీరో ఎన్టీఆర్ ను ఓ స్టార్ డైరెక్టర్ దారుణంగా తిట్టి.. షూటింగ్ కూడా క్యాన్సిల్ చేశాడట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజంగానే జరిగింది. ఆ స్టార్ డైరెక్టర్ ఈ విషయాన్ని స్వయంగా వివరించాడు. ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదట బాల రామాయణం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

తన పదేళ్ల వ‌య‌స్సులో ఎన్టీఆర్ శ్రీరాముడు పాత్రలో మెప్పించాడు. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలో ముందుగానే చిన్నపిల్లల కోసం ధనుస్సులు తెచ్చి రెడీగా ఉంచారట. అయితే పిల్లలందరూ వాటిని జాగ్రత్తగా పట్టుకుంటే.. ఎన్టీఆర్ మాత్రం షూటింగ్ మొదలు పెట్టకముందే దానిని విరిచేసాడట. తీరా షాట్ రెడీ చేశాక శివధనస్సు చూస్తే విరిగిపోయి ఉంది. దాంతో ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింద‌ట‌. ఎన్టీఆర్ దాన్ని విరిచేసాడని తెలిసిన డైరెక్టర్ విపరీతంగా కోపం తెచ్చేసుకున్నాడట. ధనుస్సు విరిగిపోయిన కారణంగా షూటింగ్ ఆపేయాల్సి రావడంతో గుణశేఖర్ ఎన్టీఆర్‌ను బండబూతులు తిట్టారట.

ఈ విషయాన్ని డైరెక్టర్ గుణశేఖర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఇలా ఎన్టీఆర్ తన చిన్న కాలంలో ఆయన చేసిన అల్లరి వల్ల డైరెక్టర్ తో చివాట్లు తిన్నాడు. అది చిన్నప్పుడు కాబట్టి ఎన్టీఆర్ అలాంటి ఇబ్బంది ఫేస్ చేశారు. అయితే ఇప్పుడు ఆయనను ఒకరు వేలెత్తి చూపించే పరిస్థితి కూడా ఎప్పుడు తెచ్చుకోకుండ ఓ జంటిల్‌మ్యాన్ గా ఉన్నాడు తారక్. ఇక బాల రామాయణంలో ఈయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ నటన చూసిన చాలామంది స్టార్ హీరోస్ అప్పట్లోనే ఎన్టీఆర్ మంచి నటుడు అవుతాడు అని చెప్పార‌ట. ఇక బాల రామాయణం సినిమాకి జాతీయ అవార్డు రావడం గమనార్హం.