రోజురోజుకి మరింత యంగ్ గా మారిపోతున్న రమ్యకృష్ణ.. లేటెస్ట్ ఫిక్స్ వైరల్..

సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకు తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్‌లో అగ్ర హీరోల అందరి సరసన నటించి ఎన్నో హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోను సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న ఈ బ్యూటీ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి తో శివగామి పాత్రలో నటించి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ను అందుకుంది.

ఈ సినిమా తర్వాత కూడా పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న రమ్యకృష్ణ ఈ సినిమా తర్వాత లైగర్, రంగమార్తాండ, జైల‌ర్‌, గుంటూరు కారం సినిమాల్లో నటించి అలరించింది. ఓ ప‌క్క‌ సినిమాలో బిజీగా ఉన్నా మరోవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది రమ్యకృష్ణ. ముఖ్యంగా ఇటీవల తను యంగ్ లుక్స్‌లో, వెస్ట్రన్ వేర్ లో ఫొటోస్ కు స్టిల్స్ ఇచ్చి ఆ పిక్స్ ను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.

స్లీవ్ లెస్ టాప్ లో.. గగుల్స్‌ పెట్టుకొని స్టైలిష్ లుక్ లో మెరిసిన రమ్యకృష్ణ సౌందర్యం తోను, యంగ్ లూక్స్ తోను ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూస్తూ ఉంటే రోజురోజుకు మరింత యంగ్‌గా కనిపిస్తూ ఆక‌ట్టుకుంటున్న‌ శివగామి పిక్స్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారాయి. దీంతో చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు.. మీ చర్మ సౌందర్యం రోజురోజుకు రెట్టింపు అవుతుంది.. అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.