మోహన్ లాల్ సినిమాలతో.. హిట్లు అందుకున్న మన టాలీవుడ్ హీరోలు వీళ్ళే..

సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో మొదటి వ‌రుస‌లో మోహన్ లాల్ పేరే వినిపిస్తుంది. ఈ హీరో తన అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ఓకీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన మోహన్ లాల్.. హీరోగా 1978లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి దాదాపు నాలుగు దశాబ్దాలపైగా సినీకెరీర్‌ కొనసాగిస్తున్నాడు. 400కు పైగా సినిమాల్లో నటించిన మోహన్‌లాల్ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని రికార్డులను ఎన్నో క్రియేట్ చేశాడు.

కాగా మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మలయాళ సినిమాలను తెలుగులో చాలావరకు మన స్టార్ హీరోస్ రీమేక్‌ చేసి హిట్లు అందుకున్నారు. అలా మన టాలీవుడ్ అగ్ర హీరోల్లో మోహన్‌లాల్ సినిమాలను తెరకెక్కించి సూపర్ సక్సెస్ అందుకున్న హీరోలు ఎవరో ఓసారి చూద్దాం. మోహన్‌లాల్ మలయాళంలో మెయిన్ లీడ్‌లో కనిపించిన ‘ దృశ్యం ‘, ‘ దృశ్యం 2 ‘ సినిమాలను తెలుగులో విక్టరీ వెంకటేష్ తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్నాడు. దీనికంటే చాలా ఏళ్ల క్రితమే 1990లో నంద‌మూరీ న‌ట‌సింహం బాలకృష్ణ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘ ఆర్యన్ ‘ సినిమాను తెలుగులో ‘ అశోక చక్రవర్తి ‘ పేరుతో రీమేక్ చేశారు. ఆర్యన్ మలయాళంలో మంచి సక్సెస్ సాధించింది.

ఇక తెలుగులో బాలకృష్ణ నటించిన ఈ సినిమాకు ఎస్. ఎస్. రవిచంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది. మోహన్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ‘ అల్లుడుగారు ‘. 1990లో తెరకెక్కిన ఈ సినిమా కూడా మోహన్‌లాల్ నటించిన ‘ చిత్రం ‘ సినిమాకి రీమేక్‌గా తెర‌కెక్కింది. ఈ సినిమాకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే మోహన్‌లాల్ మలయాళ హిట్స్ తెలుగులో ఎక్కువగా రీమేక్ చేసిన వారిలో.. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒకరు. నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ ‘నిర్ణయం ‘ సినిమా మోహన్‌లాల్ మలయాళం లో వచ్చిన ‘ వందనం ‘కు రీమేక్‌గా వ‌చ్చింది.

అలాగే మలయాళ స్పటికం తెలుగులో వజ్రం పేరుతో రీమేక్ చేశాడు నాగార్జున. అలాగే ఆయన నటించిన ‘ చంద్రలేఖ ‘ సినిమా కూడా మోహన్ లాల్ నటించిన మలయాళ ‘ చంద్రలేఖ ‘ సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కింది. అలాగే నాగార్జున, మోహన్ బాబు కలిసి నటించిన ‘ అధిపతి ‘ సినిమా మోహన్‌లాల్ మలయాళంలో చేసిన‌ ‘ నరసింహ ‘కు రీమేక్. చిరంజీవి, మోహన్ బాబు కాంబోలో వచ్చిన ‘ గాడ్ ఫాదర్ ‘ కూడా మోహన్‌లాల్ నటించిన ‘ లూసిఫర్ ‘ సినిమా ఆధారంగా రూపొందింది. ఇలా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మోహన్‌లాల్ చేసిన సినిమాలను రీమేక్ చేసి పలు బ్లాక్ బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో రజనీకాంత్ బ్లాక్ బస్టర్ ‘ముత్తు ‘ మూవీ ఒకటి. ‘ టెన్మవీన్ కొంబత్ ‘ కి రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది.