నాగేశ్వరరావు చనిపోయి కొన్ని సంవత్సరాలు అవుతున్న సరే .. ఇప్పటికీ “తూ.చా” తప్పకుండా ఆ పని చేస్తున్న నాగార్జున .. రియల్లీ గ్రేట్..!

అక్కినేని నాగేశ్వరరావు గారు టాలీవుడ్ ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ . ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ హీరో ఆయనే కావడం గమనార్హం . ఆయన ఒకప్పుడు నటించిన సినిమాలు ఇప్పటికీ మనం టీవీలో చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నామంటే కారణం ఆయన నటన ..కేవలం ఇలాంటి పాత్రలోనే నటించాలి అంటూ ఏనాడు అనుకోలేదు అక్కినేని నాగేశ్వరరావు గారు ..

తనకు నచ్చిన పాత్రలు అన్నీ చేసుకుంటూ వెళ్లారు . అందుకే ఆయన మల్టీ టాలెంటెడ్ గా పేరు సంపాదించుకున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే నాగార్జునకి ఎంత గౌరవం ప్రేమ మర్యాదలు ఇష్టం అనే విషయం అందరికీ తెలిసిందే . అక్కినేని నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు అక్కినేని నాగార్జున కుమిలి కుమిలి ఏడ్చిన దృశ్యాలు ఇప్పటికే మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం .

అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు చనిపోయి చాలా కాలమే అవుతుంది . కానీ ఇప్పటికే నాగర్జున తన నాన్నగారికి ఇష్టమైన పనిని చేస్తూనే ఉంటారు . తన నాన్నగారికి పొద్దున్నే లేచి పూజ చేయడం అంటే చాలా చాలా ఇష్టం . అయితే నాగార్జున ఇప్పటికీ తన నాన్నగారి ఫోటో వద్ద దీపం వెలిగించందే..బయటకి కాలు పెట్టడట . ఆయనకు ఇచ్చే గౌరవం అది అంటూ అక్కినేని ఫ్యాన్స్ నాగార్జునను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!