వర్క్ డెడికేషన్ అంటే ఇదే.. సినిమా కోసం అంత కష్టపడతాడు కాబట్టే బాలయ్య ‘ నటసింహం ‘ అయ్యాడు..

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ స్టేట‌స్ సంపాదించ‌డం అనేది సులువైన విషయం కాదు. దాని వెనుక ఎంతో కటోర శ్రమ ఉంటుంది. ఆ స్టార్‌డంను నిలబెట్టుకోవాలంటే అహర్నిశలు కష్టపడాల్సి వస్తుంది. అలా అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో బాలకృష్ణ ఒకరు. నందమూరి తారక రామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. తన నటనతో సత్తా చాటి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రియల్ హిట్స్, సెన్సేషనల్ రికార్డ్స్, బ్లాక్ బ‌స్టర్స్ క్రియేట్ చేసుకున్నాడు. 35 ఏళ్ల సినీ కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో నటించి నట‌సింహం బిరుదు అందుకున్నాడు.

Brahmarshi Viswamitra Telugu Full Length Movie || NTR,  Balakrishna,Meenakshi Sheshadri,

అయితే ఆయనకు ఈ బిరుదు అంత సులువుగా రాలేదు. సినిమాల్లో నటించడానికి బాలయ్య ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం హ్యాట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న బాల‌య్య‌ తన సినీ కెరీర్ లో ఓ సినిమాలు ఒప్పుకుంటే ఎంత కష్టమైనా సరే దానిని పూర్తిచేసే తీరుతాడు. సినిమా హిట్ కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాడు. అలా బాలయ్య కెరీర్ స్టార్టింగ్ లో తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించిన సినిమాల్లో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ఒకటి. ఈ సినిమా కోసం బాలయ్య ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఒక సందర్భంలో ఈయన కాలికి తీవ్రమైన గాయమైన షూటింగ్ పూర్తయ్యే వరకు అక్కడి నుంచి బాల‌య్య క‌ద‌ల‌లేద‌ట‌.

ఈ సినిమాలో క‌పాల‌ మోక్షం స‌న్ని వేశాలు రూపొందించేటప్పుడు బాలయ్య కాలి వద్ద ఒక టపాసు పేలాలి.. కానీ అది ఎంతసేపటికి పేల‌క‌పోవ‌టంతో అంతలో మరొకటి విస‌రండి అంటూ ఎన్టీఆర్ చెప్పారట. దాంతో మేకర్స్ కూడా మరో టపాసులు బాలయ్య కాలు వద్దకు విసిరారు. అయితే రెండు ట‌పాసులు ఒకేసారి బాలయ్య కాలు వద్ద పేలడంతో కాలుకు పెద్ద గాయమై రక్తం బాగా కారుతోందట‌.. అయినా షూటింగ్ పూర్తి అయ్యేవరకు బాలకృష్ణ అక్కడినుంచి కాస్త కూడా కదల్లేదట. ఇలా ఒక సన్నివేశం కోసం బాలయ్య ఇంత డెడికేషన్ గా వర్క్ చేశాడంటే.. తన సినిమా హిట్ అవ్వడానికి ఇంకెంత‌ శ్రమిస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఇంత కష్టపడతాడు కాబట్టి బాలయ్య నటసింహం అయ్యాడు.