ఒకే రోజు.. వాళ్లు నటించిన రెండు సినిమాలను రిలీజ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే..

మ‌న స్టార్ హీరోస్ అంతా సీజన్ చూసుకుని ఏడాదికి ఓ సినిమా రిలీజ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కరోనా తర్వాత ఏడాదికి ఒక్క సినిమా రావడం కూడా చాలా కష్టమైపోయింది. కానీ గతంలో అన్ని బాగున్న రోజుల్లో.. సందర్భాన్ని బట్టి ఒక హీరో నటించిన రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయడం కూడా చేసేవారు. అలా ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకరోజు రిలీజ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ హీరోలు ఎవరు.. ఆ సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

ఎన్‌టీఆర్‌


జనవరి 14, 1959లో సీనియర్ ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. అప్పుచేసి పప్పుకూడు, సంపూర్ణ రామాయణం ఈ రెండు సినిమాలు అదే రోజున రిలీజ్ అయి చరిత్ర సృష్టించాయి. అలాగే మరోసారి మే 5, 1961 లో కూడా ఈ హిస్టరీ రిపీట్ అయింది. పెండ్లి పిలుపు, సతీ సులోచన ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

శోభన్ బాబు


టాలీవుడ్ అందగాడుగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు శోభన్ బాబు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు లేడీస్ ఫ్యాన్స్ ని ఎక్కువగా సంపాదించుకున్న ఈయన.. లక్ష్మీనివాసం, పంతాలు పట్టింపులు ఈ రెండు సినిమాలను జూలై 19, 1969 లో ఒకేరోజు రిలీజ్ చేశాడు.

చిరంజీవి


మెగాస్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న చిరంజీవి.. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో కష్టాలను ఫేస్ చేశాడు. అయితే చిరంజీవి కెరీర్ లో కూడా ఒకేరోజు ఒకే ఏడాదిలో రిలీజ్ అయిన రెండు సినిమాలు ఉన్నాయి. అలా రెండుసార్లు రిపీట్ అయింది. కాళీ, తాతయ్య ప్రేమలీల సినిమాలు సెప్టెంబర్ 19, 1980 లో రిలీజ్ అయ్యాయి. అలాగే అక్టోబర్ 1, 1982లో పట్నం వచ్చిన పతివ్రతలు, టింగురంగడు రెండు సినిమాలు కూడా ఒకే రోజున రిలీజ్ అయ్యాయి.

కృష్ణ


సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఇద్దరు దొంగలు, యుద్ధం సినిమాలు కూడా ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. జనవరి 14, 1984లో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

బాలకృష్ణ


నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ రెండు సినిమాలు ఒకే ఏడాది ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. 1993 సెప్టెంబర్ 3న ఈ సినిమాల ప్రేక్షకులు ముందుకు వచ్చాయి.

నాని :


ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని కూడా కెరీర్ లో రెండు సినిమాలను ఒకే రోజు, ఒకే ఏడాదిలో రిలీజ్ చేశారు. మార్చి 21, 2017 లో జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.