సమంత – లావణ్య త్రిపాఠిలానే తెలుగింటి కోడలు కాబోతున్న మరో స్టార్ హీరోయిన్.. భలే షాక్ ఇచ్చిందిగా..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గుట్టూ చప్పుడు కాకుండా ప్రేమాయణాలు నడిపేస్తున్నారు. అంతేకాదు ఫైనల్లీ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకొని ఇది మా వెడ్డింగ్ డేట్ అంటూ బిగ్ బాంబు పేలుస్తున్నారు . కొంతమంది హీరోయిన్స్ అలానే చేశారు . రీసెంట్గా లావణ్య త్రిపాఠి సైతం అదే షాక్ ఇచ్చింది . గుట్టూ చప్పుడు కాకుండా వరుణ్ తో ఐదేళ్లు ప్రేమాయణం కంటిన్యూ చేసిన లావణ్య ఇప్పుడు తెలుగింటి కోడలుగా మారిపోయింది .

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి .. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకుంది. అంతకుముందు సమంత కూడా అంతే .. నాగచైతన్యతో ప్రేమాయణం నడిపింది . గుట్టు చప్పుడు కాకుండా నడిపిన ప్రేమాయణం ఫైనల్లీ పెళ్ళి వరకు వెళ్లి ఆ తర్వాత డివర్స్ కూడా తీసుకునే స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో హీరోయిన్ తెలుగింటి కోడలు కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

ఆమె మరెవరో కాదు శ్రీ లీల . కన్నడ బ్యూటీగా బాగా పాపులర్ రెడ్డి సంపాదించుకున్న శ్రీలీలకు ఈ మధ్యకాలంలో వరుసగా ప్లాప్స్ పడ్డాయి. ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు . దీంతో శ్రీలీల అమ్మగారు తన జాతకాన్ని చూపించగా ఆమె బడా ఇంటికి కోడలు కాబోతుంది అంటూ పంతులు చెప్పుకొచ్చారట. దీంతో షాక్ అయిపోయిందట. శ్రీలీలా ఎవరినైనా ప్రేమిస్తుందా..? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టిందట . అయితే గత కొంతకాలంగా శ్రీ లీలా హీరో కొడుకుతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . బహుశా ఆ హీరోని పెళ్లి చేసుకోబోతుందేమో అని కూడా జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!