“జాన్వి విషయంలో మీరు అందరూ అనుకున్నదే నిజం”.. ఎట్టకేలకు ఫైనల్లీ నోరు విప్పిన బోనీకపూర్..!

ఇన్నాళ్లు .. ఆ విషయంలో నోరు మూసుకొని ఉన్న బోనీకపూర్ ఫైనల్లీ నోరు విప్పాడు . దీంతో జాన్వి కపూర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ తనదైన స్టైల్ లో చక్రం తిప్పుతుంది . అంతేకాదు జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . అయితే ఇప్పటివరకు ఆమె ఒక్క హిట్ కూడా కొట్టకపోవడం గమనార్హం .

కాగా రీసెంట్గా జాన్వి కపూర్ తెలుగులో కూడా ఒక సినిమాకి కమిట్ అయింది . దేవరతో తెలుగులో డబ్బింగ్ ఇవ్వబోతుంది . సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవికి ఎంత మంచి స్థానం ఉందో మనకు తెలిసిందే. ఆమె కూతురుగా రావడంతో ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు అందుకుంటుంది . శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ .. బుచ్చిబాబు – రామ్ చరణ్ సినిమాలో భాగమైనట్లు ..ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

అయితే దీనిపై బోనీ కపూర్ అఫీషియల్ గా స్పందించాడు . నిజంగానే రామ్ చరణ్ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఫైనలైజ్ అయింది అంటూ చెప్పాడు. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన కూడా ఓ సినిమాలో నటించబోతుంది అంటూ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పాడు. ఫైనల్లీ వైరల్ అవుతున్న విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు బోనీ కపూర్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!