ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైఫ్ ఇచ్చిన సెలబ్రిటీస్ వీళ్ళే..

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. పవర్ స్టార్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న ప‌వ‌న్ నటించిన దాదాపు అన్ని సినిమాలతో సక్సెస్ సాధించాడు. అయితే ఈయన చేసిన సేవా కార్యక్రమాల ద్వారా కూడా మరింతగా గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. అన్నకు తగ్గ తమ్ముడిగా మంచి పేరు సంపాదించుకున్న పవన్ ఇండస్ట్రీలో ఎంతో మందికి అండగా నిలిచాడు. అలా పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో సక్సెస్ సాధించిన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు.

వారిలో మ్యూజిక్ డైరెక్టర్ రమ్మ‌ణ‌ గోకుల్ మొదటి వారు. వరుస సినిమాలకు ఆఫర్లు ఇస్తూ రమణగోకుల్‌ని ప్రోల్స‌హించాడు. కెరీర్ డౌన్ ఫాల్‌ సమయంలో కూడా మరోసారి అన్నవరం సినిమాతో అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆయన దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు. అలా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన వారిలో హరీష్ పాయ్‌ మాస్టర్ ఒకరు. ఈయనకు కూడా పవన్ కళ్యాణ్ తన వ‌రుస‌ సినిమాల‌కు కొరియోగ్రఫీ అవకాశాన్ని ఇచ్చి టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదగడానికి సహకరించాడు.

ఇక ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ఇండస్ట్రీకి పరిచయం చేసినదే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అండతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ప్రస్తుతం నెంబర్ వన్ ఆర్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్‌ను కూడా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ గా పరిచయం చేసిన పవన్ స్టార్.. ప్రొడ్యూసర్ గా, నటుడుగా ఎదగడానికి ఎంతో సహాయం చేశాడు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతోనే బండ్ల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్‌గా మారాడు. ఇలా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ సక్సెస్ కు కారణమయ్యాడు.