ఆ విషయంలో మమ్మల్ని ఎవ్వడు ఆపలేడు”.. అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

పుష్ప.. పుష్ప రాజ్ .. నీ యవ్వ తగ్గెదెలే..ఈ డైలాగ్ ఎంత బాగా పాపులారిటీ చెందిందో మనకు తెలిసిందే. మన వాడుక భాషలో కూడా చాలాసార్లు మనం వాడేస్తూ ఉంటాం. అంతలా సుకుమార్ క్రేజీ డైలాగు రాసుకొచ్చాడు. పుష్ప వన్ సినిమాతో సినిమా చరిత్రను తిరగా రాసిన బన్నీ.. పుష్ప 2 తో గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. రీసెంట్ గానే బిబిసి ఛానల్ కి సైతం ఇంటర్వ్యూ ఇచ్చారు .

కాగా ఇదే క్రమంలో రిపోర్టర్ బన్నీను పుష్ప2 గురించి ప్రశ్నించగా అల్లు అర్జున్ ఇచ్చిన ఆన్సర్ అభిమానులకు గూస్ బంప్స్ తప్పిస్తున్నాయి. “రైజ్ అయిపోయింది ఇప్పుడు రూలా..? అంటూ హోస్ట్ ప్రశ్నించగా .. “ఇది కేవలం పుష్ప గాడి రైజ్ కాదు పుష్ప గాడి రూల్ కాదు ఇండియన్స్ రూల్.. త్వరలోనే చరిత్ర తిరగరాయబోతున్నాం” అంటూ పుష్ప గాడు పూనిన్నట్లు ఓ రేంజ్ లో డైలాగ్స్ చెప్పాడు.

ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు బన్నీ ఫ్యాన్స్ కూడా బన్నీ లాగే కొన్ని డైలాగ్స్ చెప్తూ ట్రెండ్ చేస్తున్నారు . బన్నీ గ్లోబల్ హిట్ కొట్టడం పక్క ఇక మమ్మల్ని ఎవడు ఆపలేడు అంటూ ట్రెండ్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమానే పుష్ప. ఈ సినిమాలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. శ్రీవల్లి పాత్రలో ఇరగదీసేసింది. ప్రజెంట్ పుష్ప 2 సినిమా సెట్స్ పై ఉంది..!!