రామ్ చరణ్ తల్లిగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు అసలు ఊహించని ట్విస్ట్..

ఫోటో మూవీ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అంజలి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు వరుస సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి లాంటి సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. 2014లో వచ్చి కామెడీ హారర్ సినిమాగా భారీ సక్సెస్ సాధించిన‌ గీతాంజలి సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం అంజ‌లి ఈ సీక్వెల్ మూవి గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శివా తుర్లపాటి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Charan's Game Changer: No December, No Sankranthi

ఇక ఈ సినిమా టీజర్‌ టాలీవుడ్ లోనే మొట్టమొదటిసారిగా కొత్త వేలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను 24 శనివారం రాత్రి ఏడు గంటలకు శ్మ‌శాన వాటికలో లాంచ్ చేయబోతున్నట్లు మేకర్స్‌ అనౌన్స్ చేశారు. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. అయితే ఈ న్యూస్ విన్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గేమ్ చేంజ‌ర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసి్దే. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది.

Anjali-Sita - Anjali-Sita updated their cover photo. | Facebook

అలాగే ఎస్ జె సూర్య, సునీల్, జయరామ్‌, నవీన్ చంద్ర, నాజర్, రాజీవ్ కనకాల, అంజలి కీలకపాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంజలి క్యారెక్టర్ పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ రెండు పాత్రలో కనిపించనున్నాడు. రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫాదర్ క్యారెక్టర్ కి అంజలి జంటగా కనిపించనుందట. అంటే ఈ మూవీలో ప్రస్తుతం రామ్ చరణ్ కి అంజలి తల్లిగా నటిస్తుంది. ఈ వార్త వైరల్ అవ్వడంతో అంతా షాక్ అవుతున్నారు. అప్పుడే తల్లిపాత్రాలకు కూడా ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావ్ అంజలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.