మెరిసే చర్మం మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే సెనగపిండిని ఇలా ట్రై చేయండి..!

సాధారణంగా మనం శనగపిండిని ఉపయోగించి అనేక వంటకాలను తయారు చేసుకుంటూ ఉంటాము. కానీ అదే సెనగపిండితో మన ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. సెనగపిండిని ఉపయోగించి ఒక మాస్క్ రూపంలో ఫేస్ కి అప్లై చేయడం ద్వారా అనేక చర్మ సమస్యలు దూరం అవుతాయి.

ప్రస్తుతం అంటే ఫేస్ వాష్ మరియు ఇతర ట్రీట్మెంట్ వచ్చాయి కానీ పూర్వకాలంలో తమ అందాన్ని కాపాడుకునేందుకు ఈ శెనగపిండినే ఉపయోగించేవారు. సెనగపిండి ఉపయోగించడం ద్వారా అనేక లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే జింక్ కారణంగా మొటిమల సమస్య తగ్గుతుంది. చర్మంపై పెరుకుపోయిన సన్ టాన్ ను తొలగించడంలో సెనగపిండి సహాయపడుతుంది.

శనగపిండి చర్మానికి అప్లై చేయడం ద్వారా మృదువైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయిలీ స్కిన్ తో బాధపడే వారికి సెనగపిండి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. అందువల్ల ప్రతిరోజు సెనగపిండిని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో కొద్దిగా వాటర్ కానీ లేదా రోజ్ వాటర్ కానీ అప్లై చేసి ఫేస్ ప్యాక్ కింద వేసుకోవడం ద్వారా అనేక చర్మ సమస్యలు దూరం అవుతాయి. ఇలా కనుక ఒక వారం పాటు చేయడం ద్వారా మీకే రిజల్ట్ కనిపిస్తుంది.