వాట్: 13 సినిమాల్లో కలిసి నటించిన ఈ హీరో, హీరోయిన్లు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదా..?!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కలిసి నటించిన వారంతా బయట కూడా అంతే క్లోజ్ గా ఉంటారని అంతా భావిస్తూ ఉంటారు. అయితే తెర ముందు ఎంత క్లోజ్ గా ఉన్నా తెర వెనకు మాత్రం చాలా మంది హీరో, హీరోయిన్లు దూరం గానే ఉంటారు. చాలా వరకు సినిమాల్లో డ్యూయెల్‌ సాంగ్స్, రొమాంటిక్ సన్నివేశాలు జరుగుతాయి. ఎలాగైనా వీరిమ‌ధ్య కాస్త క్లోజ్‌నెస్ ఉంటుందని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. అయితే వాటిలో ఏ మాత్రం నిజం లేదు. ఇక పాత సినిమాల్లో అయితే వారిద్దరు సినిమాలో క్లోజ్ గా నటించినట్లు.. బయట ఎక్కడైనా కలిసి తిరుగుతుంటే మాత్రమే అది నిజం అనుకునేవారు. లేదంటే ఆ అవకాశాలే ఉండేవి కాదు. ఇప్పుడున్న సోషల్ మీడియాలో చీమ‌ చిటికమన్న వెంటనే తెలుస్తుంది. ఏ హీరో, హీరోయిన్ అయినా రెండు సినిమాలు కంటే ఎక్కువగా నటిస్తే వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఆ వార్తలను సులువుగా నమ్మేస్తున్నారు.

అయితే పాత సినిమాల సమయంలో అలా ఉండేది కాదు. ఎవరి ప్రొఫెషన్ను వారు చూసుకునేవారు. స్క్రీన్ మీద ఉన్నంతవరకే వారు క్లోజ్ గా ఉండేవారు. ఒక్కసారి ఆఫ్ స్క్రీన్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరి పని వారు చూసుకునేవారు. అప్పట్లో ఏదైనా జరిగినా కూడా ఎవరో ఒకరు మీడియాకి చెప్తే కానీ ఆ విషయం బయటకు తెలిసేది కాదు. అందుకు ఓ మంచి ఉదాహరణ వాణిశ్రీ, కృష్ణ. వీళ్ళిద్దరూ కలిసి దాదాపు 13 సినిమాల్లో నటించారు. అయితే వీరిద్దరూ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదట. ఇది ఆశ్చర్యంగా అనిపించిన ముమ్మాటికి నిజం. అయితే వీరిద్దరి మధ్యన ఏదైనా గొడవలు ఉన్నాయా అంటే అలాంటివి ఏమీ లేవు. వీరిద్దరు కేవలం నటనకు ప్రొఫెషన్‌కు మాత్రమే గౌరవం ఇచ్చి వారి ప్రొఫెషన్‌గా నటించడం అయిపోయిన తర్వాత ఎవరి పని వారు చూసుకునేవారు. వాటికి స్పెషల్గా కారణాలంటూ ఏమీ లేవని తెలుస్తుంది. స్వతహాగా కృష్ణ చాలా తక్కువగా మాట్లాడే స్వభావం గలవారు.

ఆయన ఎంతో క్లోజ్ అయితే తప్ప.. ఎవరితోను సన్నిహితంగా ఉండలేరు. అది అర్థం చేసుకున్న వాణిశ్రీ ఆయనకు ఇష్టం లేనప్పుడు మనం మాట్లాడడం మంచిది కాదు అని ఆమె కూడా ఎప్పుడూ కృష్ణ గారిని పలకరించేది కాదట. గొడవలు లేకపోయినా మాట్లాడుకోకుండా ఏకంగా 13 సినిమాల్లో నటించిన ఏకైక జంట వీళ్ళు మాత్రమే. అయితే కృష్ణ గారు ఎందుకు త‌న‌తోమాట్లాడరు అని వాణిశ్రీ స్టార్టింగ్‌లో ఆలోచించేవారట. ఆ తర్వాత అసలు ఆలోచించడం వల్ల ఉపయోగం ఏముంది.. ఆయన మనస్తత్వం అదే నేమో.. అని సర్దుపుచ్చుకున్నారట. అయితే వాణి శ్రీ, కృష్ణ కలిసి మాట్లాడుకున్న సందర్భం ఒకేఒకటి. అదే మొదటిది, చివరిది కూడా. అది కూడా వెంకటేష్ సినిమాకు తల్లి పాత్ర చేయమని కృష్ణ గారు వాణిశ్రీని అడిగాడట.. కానీ ఆ సినిమా క్లైమాక్స్ లో కొడుక్కి విషయం పెట్టి చంపే తల్లి పాత్ర చేయడానికి ఆమె ఇష్టపడలేదు. మనసు ఒప్పుకోక ఆ రోల్‌ నేను చేయను అని చెప్పేసారట. అదే కృష్ణ, వాణిశ్రీ మాట్లాడుకున్న మొదటి చివరి మాట.