ప్రియుడుతో పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్.. ముహూర్తం ఖరారు..!

ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు అందరూ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెబుతూ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే రీసెంట్గా రకుల్ కూడా పెళ్లి చేసుకోగా ప్రస్తుతం మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

ఆమె మరెవ్వరూ కాదు బాలీవుడ్ భామ మీరా చోప్రా. తన అందం నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం అనేక సినిమాల‌లో నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు హిందీ మరియు తమిళ్, కన్నడ భాషల్లో కూడా నటించింది.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మీరా పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. అంబానీ కి చెందిన ఓ వ్యాపార వేత్తతో దాదాపు ఆరేళ్లగా డేటింగ్ లో ఉన్న మీరా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఇక మార్చ్ 11నే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ వార్త తెలుసుకున్న ఈమె అభిమానులు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.