నాని ” సరిపోదా శనివారం ” నుంచి రిలీజ్ అయిన సరికొత్త పోస్టర్.. సూపర్ ఉంది అంటున్న ఫ్యాన్స్..!

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో వివేక్ దర్శకత్వంలో యాక్షన్ మూవీ ” సరిపోదా శనివారం “. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పై నాని అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా నుంచి శనివారం అనగా ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. హీరో నాని బ్యాక్ పొస్ తో ఉన్న పోస్టర్ ఆడియన్స్ను బేబచ్చంగా ఆకట్టుకుంది. ఈ శనివారం ఉదయం 11:59 గంటలకు సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ కానున్నట్లు ఈ పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఇక నాని చాలాకాలం అనంతరం ఓ యాక్షన్ సినిమా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాకి డివివి దానియ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ ని చూసిన కొందరు.. నిజంగా పోస్టర్ అదిరిపోయింది బ్రో. ఈ పోస్టర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.