బన్నీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. భారీ ఆస్తులను అమ్మనున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ..

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పుష్ప తర్వాత పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకున్న బన్నీ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక సినిమాల పరంగా దూసుకుపోతున్న బ‌న్నీ.. ఆహ్వా స్థాపన చేయడం ద్వారా ఓటీటీ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు. ఆహా తెలుగు చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో ఇలాంటి ప్రత్యేకమైన కంటెంట్‌ను అందిస్తూ మంచి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ గా నిలిచింది. మొదటి తెలుగులో మాత్రమే ఈ ప్లాట్‌ఫారం ప్రారంభించిన బ‌న్నీ కొంత‌కాలానికి ఆహా తమిళ్ కూడా ప్రారంభించి ఓటీటీ వేదికపై తన ప్లాట్ ఫామ్ ను మరింత విస్తరించాడు.

Allu Arjun Presents AHA | #LifeLoAHAUndali

అయితే తాజాగా బన్నీ ఫ్యామిలీ ఓ భారీ ఆస్తిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. దానికోసమే టీం అన్వేషిస్తున్నట్లు తెలుస్తుంది. న్యూ ఇయర్ షిప్ లో విజయం సాధించిన అనేక డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల‌తో ఆహా ఫైనాన్షియ‌ల్ ఛాలెంజ్‌లు ఎదుర్కొంటుందట. అలాగే మూవీస్, వెబ్ సిరీస్ లతో సహా.. కంటెంట్.. అధిక ధరలు కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు గణ‌నీయంగా లాభాలను పొందడం చాలా కష్టంగా మారింది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్ల‌స్‌ హాట్ స్టార్, జీ 5 లాంటి పెద్ద ప్లాట్ ఫామ్ లు ఉన్న సమయంలో మీడియం భారీ బడ్జెట్ సినిమాలను సురక్షితంగా అందించేందుకు అవి పోటీ పడుతున్నాయి.

Allu Arjun to host a talk show for Aha?

ఇక ఆహా మీడియా చిన్న చిత్రాలపై దృష్టి పెడుతూ.. కష్టతరమైన పోటీలు ఎదుర్కొంటుంది. అంతేకాదు ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటే.. ఆహా సబ్‌స్క్రిప్షన్ ధ‌ర చాలా తక్కువగా ఉండడంతో.. ఆ పరిమితులతో ఆహను రన్ చేయడంపై టీం ఇంట్రెస్ట్ కోల్పోతున్నారట. దీంతో వీరు ప్లాట్ఫార్మ్ ను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నెటింట‌ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఆహా లాంటి ఓ ప్రతిష్టతముకమైన ప్లాట్ ఫామ్ ను బన్నీ ఫ్యామిలీ వికరిస్తున్నారని తెలియడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.