బేబీ బ్యూటీ ‘ లవ్ మీ ‘ మూవీ స్టోరీ మొత్తం లీక్ చేసిన దిల్ రాజు.. అలానే ఉందంటూ..

బేబీ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వైష్ణవి చైత‌న్య‌.. మొదటి సినిమాతోనే టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు.. తర్వాత వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కొత్తతరం కథలతో తెర‌కెక్కుతున్న సినిమాల్లో వైష్ణ‌వి నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన మూవీ.. లవ్ మీ. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత్‌, నాగ మల్లిడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అరుణ్ భీమవరం డైరెక్షన్లో.. ఆశిష్ హీరోగా, శిరీష్ సమర్పణలో ఈ మూవీ రూపొందింది.

Ashish and Vaishnavi Chaitanya's film is titled Love Me – If You Dare | 123telugu.com

కాగా ఈ సినిమాకు లవ్ మీ.. ఇఫ్ యు డేర్ అనే టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. దిల్ రాజు మాట్లాడుతూ నిజానికి ఆశిష్, హర్షిత్, హన్షిత్ ముగ్గురు వేరువేరు ప్రాజెక్టులు చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా వీరి వద్దకు రావడం ముగ్గురికి కథ నచ్చడంతో దీనిపై వీరు కలిసి పనిచేశారు. నాకు ఆర్య కథ విన్న టైంలో ఎలా జరిగిందో.. వీళ్ళకి ఈ సినిమాతో అలాగే జరిగింది. ఏప్రిల్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ వివరించారు.

Love Me motion poster - Ashish Reddy's new look from the romantic thriller stuns; here's why..

అయితే దిల్ రాజు కామెంట్స్ వైర‌ల్ అవ్వ‌డంతో లవ్ మీ.. ఆర్య సినిమా పోలికలను కలిగి ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆర్య సినిమా రోజులు గుర్తుకు వచ్చాయంటూ లవ్ స్టోరీ ఆ తరహాలో ఉంటుందని మొత్తం స్టోరీ లీక్‌ చేసేసావు కదా దిల్ రాజు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాపై వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. నాకు ఈ మూవీ ఎంతో స్పెషల్.. ఇలాంటి అంశంతో నేను సినిమాలో ముందెప్పుడు నటించలేదు. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ వస్తుంది. ఇక ఈ మూవీ చూసే ఆడియో డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ తో దియేటర్ల నుంచి బయటకు వేస్తారు అంటూ వివరించింది.