రామ్ చరణ్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మరోసారి వాయిదా పడిన ‘ గేమ్ చేంజర్ ‘.. రిలీజ్ అయ్యేది అప్పుడే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ నుంచి సోలోగా ఒక్క సినిమా కూడా రాక‌పోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. చరణ్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ మెగా ఫాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్లో ఇబ్బందులు నేపథ్యంలో.. సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో మొదట షూటింగ్ పూర్తి చేయడమే ప్రధాన ధ్యేయంగా మేకర్స్ పనిచేస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా షూటింగ్ పూర్తవ‌టానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. అయితే సెప్టెంబర్ నెలలో లేదా దసర సందర్భంగా.. అది కుదరకపోతే దీపావళిలో కచ్చితంగా మూవీ రిలీజ్ చేస్తారంటే ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏకంగా డిసెంబర్ నెలకు వాయిదా పడిందని తెలుస్తుంది. అప్పటిలోగా షూటింగ్, మిగతా ప్రమోషన్స్ అన్ని పూర్తి చేసి ఏడాది చివరిలో డిసెంబర్ 25 క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారటా. ఇక ఈ ఏడాది డిసెంబర్ 25 బుధవారం రావడం.. తర్వాత ఒక్క గురువారాన్ని వదిలేస్తే మిగతా మూడు రోజులు వీకెండ్ డేస్ కావడంతో లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని ఉద్దేశంతో అదే రోజున సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట మూవీ టీం.

అలాగే ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా వేరే లెవెల్ లో ఉండనున్నాయని.. సినిమా ఆ లెవెల్ లో రూపొందిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్గా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ మూవీలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ రోల్స్‌లో నటించబోతున్నాడు. దిల్ రాజు – శిరీష్ సమ్యుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ స్కేడ్యూల్ నిన్ననే పూర్తయింది. ఇక మార్చి రెండో వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుందని టాక్. త్వరలోనే గేమ్ చేంజ‌ర్‌ రిలీజ్ డేట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజు త్వరలోనే రాబోతున్న క్రమంలో చెర్రీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.