బాలయ్య 109వ మూవీ రిలీజ్ డేట్ పై సాలిడ్ బజ్..!

బాలయ్య ఇటీవలయ భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక‌ ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న మూవీ లో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

బాలయ్య 109వ సినిమా పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా కంప్లీట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు చిత్ర బృందం.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఈ సినిమా ఇతర అప్డేట్స్ తో పాటుగా రిలీజ్ ఎప్పుడు అనేది కూడా ఆసక్తిగా మారగా ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ పై సాలిడ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని మేకర్స్ జూలై 3 లేదా 4వ వారంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే జూలై 19 లేదా 26వ తేదీన బాలయ్య సినిమా బాక్స్ ఆఫీస్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే వార్త‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.