ఓ మై గాడ్: స్టార్ హీరోలను మించి సంపాదిస్తున్న ప్రభాస్ డూప్.. రేటు తెలిస్తే కళ్ళు జిగేల్..

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఒక సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్లు ప్రభాస్ తీసుకుంటున్నాడు. అయితే ఆయన రేంజ్‌కు తగ్గట్టుగానే ప్రభాస్‌ డూప్ గా చేస్తే వ్యక్తికి కూడా విపరీతమైన డిమాండ్ ఉందట. అతని సంపాదన స్టార్ హీరోలకు ముంచిపోయి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దాదాపు చాలా సినిమాల్లో సాధార‌ణంగా డూప్‌ను వాడ‌తారు. హీరో డ్యూయల్ రోల్ చేస్తే కాంబినేషన్ సీన్స్ లో కచ్చితంగా డూప్ కావ‌ల్సి ఉంటుంది. ముఖ్యంగా స్టంట్స్‌, పోరాట సన్నివేశాలు చేసేటప్పుడు డూప్ అవసరం ఉంటుంది. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అంద‌రి హీరోల‌కు దాదాపు డూప్స్ ఉంటారు.

ఎక్క‌డో కొందరు హీరోలు మాత్రమే డూప్ లేకుండా రిస్కీ స్టాండ్స్ చేస్తూ క్రేజ్‌ సంపాదించుకుంటారు. అయితే ఇటీవల కాలంలో ప్రభాస్ మీద ఓ రూమర్ గట్టిగా వినిపిస్తుంది. ఇటీవల కాలంలో ప్రభాస్ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో డూప్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నాడని.. ప్రభాస్ చేసేది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కావడంతో.. ఆయన మోకాళ్ల నొప్పి, నడుము నొప్పి సమస్యలతో ప్ర‌భాస్ డూప్‌ను తప్పనిసరిగా వాడుతున్నాడని తెలుస్తుంది. సలార్ మూవీలో కూడా డూప్ తోనే చాలా సీన్లు కంటిన్యూ చేశారట. అలా ప్రభాస్ డూప్ కూడా ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా బిజీబిజీగా గ‌డుపుతున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాలో కూడా ప్రభాస్ డూప్ యాక్షన్స్ స‌న్నివేశాల్లో వాడబోతున్నట్లు తెలుస్తుంది.

ఇది సైన్స్ ఫిక్షన్ డ్రామా క‌నుక యాక్ష‌న్ సీన్స్‌ ఎక్కువగానే ఉంటాయని.. ఆ సన్నివేశాలకు కచ్చితంగా డుప్‌ను తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌లో తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. ఇక మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్‌ సినిమాలో అయితే ప్రభాస్ డూప్ చార్జి చేస్తున్న రెమ్యునరేషన్.. దాదాపు స్టార్ హీరో తీసుకునే రవీనరేషన్ కి ఈక్వల్ గా ఉందని అంటున్నారు. అతడు రోజుకు ఏకంగా 30 లక్షల రెమ్యున‌రేషన్ డిమాండ్ చేస్తున్నాడట. సాధారణంగా డూప్ కు రోజుకు లక్ష ఇస్తే చాలా ఎక్కువ. అలాంటిది రూ.30 లక్షలు అంటే అతని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన ప్రభాస్ డూప్ ఒక్క సినిమాకు పది రోజులు పని చేస్తే మూడు కోట్లు తీసుకుంటాడు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ న్యూస్ తెగ చెక్కర్లు కొడుతుంది. బాహుబలి లో కూడా ప్రభాస్ డూప్‌ని వాడడం గమనార్హం.