పవన్ కళ్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల.. లేటెస్ట్ ట్విట్ వైరల్..?!

ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్‌ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఎన్నికలకు మూడు రోజులే ఉన్న తరుణంలో ప్రతి పార్టీ ఈరోజు ఎన్నికల చివరి రోజు ప్రచారాన్ని జోరుగా కొనసాగించే ప్లాన్లో ఉన్నాయి. ఇప్పటివరకు వారి మేనిఫెస్టోల‌తో ప్రజలకు వరాలు కురిపించిన అన్ని పార్టీల వారు.. తమకు ఓటు వేయాలని అభ్యర్థించే చివరి రోజు కావడంతో ప్రచారంలో మరింత జోరుపెంచారు. ప్రస్తుతం రాష్ట్రం అంతా రాజకీయ వేడి జోరుగా సాగుతుండడం ఒక ఎత్తు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ వేడి మరో లెవెల్ లో ఉంది.

Sreeleela's Adorable Speech In Shah Rukh Khan's Style After Winning Her First Award | Sreeleela's Adorable Speech In Shah Rukh Khan's Style After Winning Her First Award #Sreeleela #SIIMA2021 #BestDebutantActress | By

గత ఎన్నికల్లో భీమ‌వ‌ర‌రం, గాజువాక రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్.. ఈసారి ఎలాగైనా గెలిచేందుకు కసితో ప్రయత్నిస్తున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి మాత్రమే కాకుండా.. టాలీవుడ్ నుంచి చాలామంది స్టార్స్, హీరోలు, సెలబ్రిటీస్ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, లాంటి మెగా హీరోలు పిఠాపురంలో ప్రచారం చేయగా.. చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ మద్దతుగా వీడియోని రిలీజ్ చేశారు.నాని, అల్లు అర్జున్, తేజ స‌జ్జా లాంటి క్రేజీ హీరోస్ కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా ట్విట్ షేర్ చేశారు. ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు పిఠాపురం ప్రచారంలో పాల్గొన్నడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Pawan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన దృశ్యాలు.. | Pawan Kalyan visit to Pithapuram Photos anr

ఈ క్రమంలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల.. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా తన ఎక్స్ ఖాతాలో ఒక ట్విట్ షేర్‌ చేసింది. పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు కోరుకున్నది సాధిస్తారని.. ప్ర‌మాణాల‌ను నిలబెట్టుకుంటారని భావిస్తున్నా.. పిఠాపురంలో మీరు భారీ మెజారిటీతో గెలుపొందాలని దేవుని ప్రార్థిస్తున్నా.. అంటూ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కు తన మద్దతు తెలుపుతున్నట్లు అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీ లీలా ట్విట్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. పవన్ ఫ్యాన్స్ అంతా శ్రీ లీలకు ఫిదా అవుతున్నారు.