త్రివిక్రమ్ కేక పెట్టించే నిర్ణయం.. ఆ హై వోల్టేజ్ స్టార్ హీరోతో సినిమా ఫిక్స్ చేసేసుకున్నాడుగా..!

త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటల మాంత్రికుడు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ ..ఎలాంటి డైలాగ్స్ అయినా సరే అవలీలగా రాసేయగలడు. మరీ ముఖ్యంగా జనాలకు యువతకు నచ్చే విధంగా డైలాగ్స్ రాసి మెప్పించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుని ఢీ కొట్టే వ్యక్తి మరొకరు లేరు అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఆయన సినిమాలోని డైలాగ్స్ ఖచ్చితంగా మనం వాడుక భాషల్లో ఎక్కడో ఒకచోట వాడే ఉంటాం .

చాలా సరదాగా ..చాలా ఫన్నీగా ..చాలా ఆహ్లాదకరంగా.. ఆలోచన చేసే విధంగా ఉంటాయి . కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తన లైఫ్ లో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా గుంటూరు కారం అని చెప్పుకోవాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ఈ సినిమాలో కనిపించారు . ఈ సినిమా పరమ చెత్త టాక్ అందుకుంది.

ఇప్పుడు నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన విషయం మనకు తెలిసిందే. అది ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియని పరిస్థితి . ఈ లోపే త్రివిక్రమ్ శ్రీనివాసరావు టాలీవుడ్ ఇండస్ట్రీలో హై వోల్టేజి స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ పోతినేనితో ఒక సినిమాకి కమిట్ అయ్యి.. సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడట. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ పోతినేని కూడా ఇది మంచి అవకాశం కావడంతో ఈ సినిమాని ఓకే చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!