ఒకే ఒక్క పనితో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న జగతి ఆంటీ..గుండెలు పిండేసిందిగా(వీడియో)..!

జగతి ఆంటీ .. సోషల్ మీడియాలో ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది . అంతేకాదు తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే జగతి ఆంటీ అలియాస్ జ్యోతి రాయి పెళ్లి అయి ఒక బిడ్డ ఉన్నా కూడా యంగ్ డైరెక్టర్ సుఖ పూర్వ రాజ్ ను రెండో పెళ్లి చేసుకుంది అంటూ ప్రచారం జరిగింది . అన్నట్టుగానే ఆమె ఆయనతో బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ వచ్చింది.

అయితే రీసెంట్ గానే జ్యోతి రాయి హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హల్చల్ చేశాయో మనం చూసాం. ఇప్పటివరకు జ్యోతి రాయి పేరు చెప్తే అందరూ హాట్ ఎక్స్పోజింగ్ చేసే ఫిగర్ అని అనుకునేవాళ్లు .. ఆమెలోని ఓ మంచి మనసు ఉంది అని తాజాగా ప్రూవ్ చేసుకుంది జ్యోతి రాయ్. అక్షయ్ తృతియా చాలా సందర్భంగా గొప్ప మనసు చాటుకునింది జ్యోతి . అక్షయ్ తృతియా నాడు బంగారం కొనుగోలు చేయకుండా ఆర్థికంగా బాధపడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యకు సహాయం చేసింది .

మొత్తంగా 50 వేల రూపాయలను ఇచ్చి తన వంతు సపోర్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ..”నేను కూడా ఇబ్బందుల్లో ఉన్నాను కానీ.. నా కష్టాల కంటే మొగిలయ్య ఇబ్బందులు నన్ను కలిసి వేసాయి. అందుకే నాకు తోచినంత సహాయం చేస్తున్నాను .. ఆయన ప్రతిభకు నేను చేసిన సహాయం చాలా చిన్నది .. ఆయనను ఆదుకోవడానికి మీరు ముందుకొస్తారు అని అనుకుంటున్నాను ” అంటూ ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు జగతి ఆంటీ మనసు ఇంత మంచిదా..? అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!