చిరంజీవి కారణంగా రెండు క్రేజీ సినిమాలు వదులుకున్న చరణ్.. రిజల్ట్ ఏంటో తెలుసా..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తండ్రి మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చ‌ర‌ణ్‌ తండ్రికి తగ్గ తనయుడుగా దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం శంక‌ర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్‌ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఆర్‌ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా ఒక్క సినిమా కూడా వెండితెరపై రాకపోవడంతో.. ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Watch Gangotri Movie Online for Free Anytime | Gangotri 2003 - MX Player

ఇదిలా ఉంటే తాజాగా రాంచరణ్ కి సంబంధించిన మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి కారణంగానే రామ్ చరణ్ రెండు క్రేజీ సినిమాలను మిస్ చేసుకున్నాడు అంటూ.. ఆ సినిమాల్లో చేసి ఉంటే రామ్ చరణ్ క్రేజ్ మరింతగా పెరిగేది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలో ఏంటో.. చిరంజీవి ఆ సినిమాలను రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటో.. ఒకసారి చూద్దాం. అల్లు అర్జున్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మూవీ గంగోత్రి. ఈ సినిమాకు మొదట రామ్ చరణ్ హీరోగా తీసుకోవాలని భావించారట మేకర్స్. అయితే ఆఫర్ రామ్ చరణ్ కి వచ్చిన చిరంజీవి సినిమాకు నో చెప్పారట.

Josh (2009) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

అప్పటికి రాంచరణ్ కు సరిగా యాక్టింగ్ రాకపోవడంతో.. న‌ట‌న‌లో శిక్షణ ఇంకా తీసుకోవాలని.. చిరంజీవి గారు రాంచరణ్ తో వద్దు.. అల్లు అర్జున్తో సినిమా తీయండి అంటూ సలహా ఇచ్చాడట. అలాగే నాగచైతన్య హీరోగా తెరకెక్కిన జ్యోష్ సినిమాలో కూడా రామ్ చరణ్ కి మొదటి అవకాశం వచ్చిందని.. కానీ స్టోరీ విన్న చిరంజీవి అందులో ఎన్నో సందేహాలు ఉన్నాయి.. దాంతో పాటే మగధీర లాంటి పెద్ద సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ కు ఈ సినిమా అసలు సెట్ అవదు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాను కూడా రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది. కాగా ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించి వారికి హిట్ అందించాయి. గంగోత్రి అయితే బన్నీ కెరీర్ లోనే స్పెషలిస్ట్ సినిమాగా నిలిచిపోయింది. ప్ర‌స్తుతం ఈ న్యూస్ నెటింట వైర‌ల్ అవుతుంది.