జనసేనకు సపోర్ట్ అంటూ ట్విట్.. వైసీపీ అభ్యర్థి కోసం ఏపీకి బన్నీ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

మరో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో లోక్ స‌భ ఎన్నికలు మొదలుకానున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో లోక్ స‌భ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల వారు తమ మేనిఫెస్టోలను ప్రకటిస్తూ పెద్ద ఎత్తున ప్రచారాలు సాగిస్తున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నిస్తూ ఎన్నో వరాలు కురిపిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో సినీ గ్లామర్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం లో పోటీ చేయడంతో ఆయనకు టాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలామంది స్టార్ హీరోస్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే.

IconStar Allu Arjun Expresses Support for Pawan Kalyan's Political Journey

ఇందులో భాగంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మామ పవన్ కళ్యాణ్ కు మద్దతు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ అభిమానులంతా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే విశ్వ‌శ‌నీయ వ‌ర్గాల సమాచారం ప్రకారం అల్లు అర్జున్ స్నేహితుడైన నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో తన భార్య స్నేహ రెడ్డితో కలిసి బన్నీ నంద్యాలకు చేరుకుని.. ఆయనకు శుభాకాంక్షలు తెలపనున్నట్టు తెలుస్తోంది.

Balaa | 𝗦𝗶𝗱𝗱𝗵𝗮𝗺 on X: "Allu arjun YCP ki support chesthe.. Pushpa  actor Allu Arjun Janasena ku support chesthe.. Icon star Allu Arjun Em  eripuk bathuku ra needi @Telugu360 🤡 #AlluArjun #VoteForFan

అలాగే అల్లు అర్జున్ తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎలక్షన్ క్యాంపైన్‌ను భార్యతో కలిసి చేస్తాడంటూ నెట్టింట చర్చలు కూడా మొదలయ్యాయి. ఏదేమైనా స్నేహితుడి కోసం అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి అతని శుభాకాంక్షలు తెలుపుతున్న క్రమంలో అభిమానులు ఇప్పుడు బన్నీ సపోర్ట్ పవన్‌కా లేదా వైసీపీకా అంటూ సందేహంలో పడ్డారు. ఇక శనివారం నాడు అల్లు అర్జున్ భార్యతో కలిసి నంద్యాలలో ఎలక్షన్ క్యాంపైన్‌ నిర్వహిస్తాడంటూ వార్తలు నిజం ఎంతుందో తెలియాలంటే కొంత స‌మ‌యం వేచి చూడాలి.