గోపీచంద్ తో గొడవపడి అతని ముక్కు పగలగొట్టిన ప్రభాస్.. అసలు గొడవ ఏంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, గోపీచంద్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ కూడా వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు నుంచి విరి స్నేహం మొదలైంది. ఇక వీరిద్దరూ కలిసి వర్షం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరీ స్నేహం మరింతగా బలపడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వీరి ఫ్రెండ్షిప్ అలానే కొనసాగుతుంది. అయితే బెస్ట్ ఫ్రెండ్స్ గా రాణిస్తున్న ఇద్దరు కలిసి.. మళ్ళీ ఓ సినిమాలో నటించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే గతంలో ప్రభాస్.. గోపిచంద్‌ను కొట్టానంటూ షేర్ చేసుకున్నాడు. అప్పుడు గోపీచంద్ కు ముక్కు పగిలిందని చెప్పుకొచ్చాడు.

Gopichand confirms his film with Prabhas?

అయితే వీరిద్దరి మధ్య అంత పెద్ద గొడవ ఏం జరిగిందో.. అంత‌లా ఎందుకు కొట్టాడో ఒకసారి చూద్దాం. గతంలో బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న ప్రభాస్.. గోపీచంద్ వ్యక్తిత్వం గురించి తెలియజేశాడు. ఆయన చాలా ఓపికగా ఉంటాడని, ఏమాత్రం చిరాకు పడడని, వివరించిన ప్రభాస్.. వారి మ‌ధ్య‌న జరిగిన ఈ సంగ‌ట‌న గురించి వివరించాడు. ఓసారి షూటింగ్ టైంలో గోపీచంద్ కు గాయం అయిందని.. ప్రభాస్ కి నవ్వితే మనుషులను నెట్టే అలవాటు ఉందని.. గోపీచంద్ ని అలా తరచూ నెట్టు తుండడం.. కొట్టడం చేస్తూ ఉండేవాడని వివరించాడు. అయితే ఆరోజు అప్పటికే గోపీచంద్ ముక్కు పగిలిందని.. దాంతో గోపీచంద్ ముందే.. అరేయ్ ఈరోజు నవ్వుతూ కొట్టొద్దు.. జాగ్రత్తగా ఉండాలని వివరించాడని చెప్పుకొచ్చాడు.

Prabhas & Gopichand Reveal About The heroine They Fought For!

కానీ ప్రభాస్ ఆ విషయాన్ని మర్చిపోయి కారులో వెళుతున్న టైం లో ఏదో జోక్ వేస్తే ఇద్దరు తెగ నవ్వుకున్నారని.. ఆ క్ర‌మంలో గోపీచంద్ ని కొట్టేసినట్లు ప్రభాస్ వివరించాడు. దెబ్బకి ముక్కు నుంచి రక్తం కారిందట. అయినా గోపీచంద్ చిరాకు పడకుండా.. ముక్కు నుంచి కారుతున్న రక్తాన్ని తుడుస్తూ.. అరే ఏంట్రా ఇది.. కొంచెం చూసుకోరా అని చెప్పాను కదా.. అన్నాడని వివరించాడు. పాపం మంచోడు సర్.. చిరాకు రాదు సార్.. అని బాలయ్యకి గోపీచంద్ గురించి చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఇలా వారిద్దరి మధ్యన ఉన్న బాండింగ్ గురించి ప్రభాస్ తెలియజేసిన వీడియో క్లిప్ మరోసారి నెటింట‌ వైరల్ గా మారింది.

Unstoppable With NBK 2 with Prabhas Part 2. Baahubali star opens up about  his uncle Krishnam Raju, success and failure. - India Today

ఇక ప్రస్తుతం గోపీచంద్ శ్రీనువైట్ల డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. దీనికి విశ్వం అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గోపీచంద్ తన కెరీర్ లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోబల్ స్టార్ గా పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ప్రభాస్ త్వరలో కల్కి 2898 ఏడి. రాజా సాబ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వీటితో పాటు ప్రస్తుతం ప్రభాస్ కాన‌ప్ప‌, సలార్ 2, స్పిరిట్ సినిమాలతో పాటు హ‌నురాగపూడి డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు.