ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో సారత్రిక ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసింది. ఇక ఈ ఎన్నికల కోసం టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కూటమీలో ఈ మూడు పార్టీలు కలిపి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి నిలబడిన సంగతి తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఇప్పుటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు పిఠాపురంలో జోరుగా ప్రచారం చేశారు. మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ జనసేన మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని పిఠాపురం ప్రజలు గెలిపించాలంటూ వీడియో ద్వారా సందేశాన్ని అందించాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు తన మద్దతును తెలిపాడు. రామ్ చరణ్ కూడా తన తండ్రి పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయమంటూ అభ్యర్థించిన వీడియోను షేర్ చేస్తూ.. మీ భవిష్యత్తుకు న్యాయం చేయగలిగే నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అంటూ ట్విట్ చేసాడు. ఈ క్రమంలో రాంచరణ్ ప్రచారానికి రావడం కుదరదుకనుక.. ట్విట్టర్ వేదికగా సపోర్ట్ చేశారంటూ అంత భావించారు. అయితే చరణ్ పిఠాపురం ప్రజలకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ప్రచారంలో చివరి రోజున అంటే నేడు రామ్ చరణ్ ఎన్నికల ప్రచారం కోసం పిఠాపురం వస్తున్నాడట.
తల్లి సురేఖ కలిసి నేడు ఉదయం 9:30కు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటాడని.. పిఠాపురంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు అనంతరం పిఠాపురం లో పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ వద్దకు చరణ్ చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోగా.. ఈసారి పిఠాపురం నుంచి ఎలాగైనా సక్సెస్ సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని శ్రమిస్తున్నాడు. దీంతో 2024 ఎన్నికలు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీస్ పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు రాంచరణ్ వస్తూ ఉండడంతో జనసేన క్యాడర్‌లో ఫుల్ జోష్ మొదలైంది.