అరెరె..సడన్గా సమంత ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటబ్బా..?

ఒకే ఒక్క నిర్ణయంతో సోషల్ మీడియాలో హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుంటుంది హీరోయిన్ సమంత . మనకు తెలిసిందే సమంత పెళ్లి తర్వాత సాకీ అనే బ్రాండెడ్ బట్టల షాప్ ను మెయిన్ టైన్ చేస్తుంది . అయితే విడాకులు తర్వాత కొన్నాళ్లపాటు ఎటువంటి రిస్క్ లేకుండా టెన్షన్స్ లేకుండా గడిపిన సమంత ఇప్పుడు మళ్ళీ తన ఫోకస్ తన బిజినెస్ పై పెట్టింది . రీసెంట్గా సమంత తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది .

తన సకీ కంపెనీకి వర్క్ చేసేందుకు ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్ ..ఫ్యాషన్ డిజైనర్స్ కావాలి అంటూ ప్రకటన చేసింది . అర్హత గల వారు సంప్రదించండి అంటూ ఒక మెయిల్ ఐడి కూడా ట్యాగ్ చేసింది . దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే సమంత ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి సడన్గా బిజినెస్ పై కాన్సన్ట్రేషన్ చేయడంతో జనాలకు రకరకాల డౌట్ వస్తుంది .

సమంత కొంపతీసి సినిమాలు కి గుడ్ బై చెప్పబోతుందా..? అందుకే ఈ విధంగా బిజినెస్ పై కాన్సన్ట్రేషన్ చేయడానికి నిర్ణయించుకుందా..? అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మరికొందరు సమంతకి ఫైనాన్షియల్ గా టైట్ అవుతుంది అని ..ఆ కారణంగానే కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి మళ్లీ తన లైఫ్ను బిందాస్ గా గడపడానికి ట్రై చేస్తుంది అని .. ఆ కారణం చేతన ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పుకొస్తున్నారు . సమంత ఏ కారణం చేత ఈ నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి గా ఉన్నారు ..చాలామంది ఈ జాబ్స్ కి అప్లై చేస్తున్నారు..!!