“ఆ రోజు అక్కడి రా..నేను అంటే ఏంటో తెలుస్తాది”..పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ వైరల్..!

కేవలం కొద్దిగంటలే మరికొద్ది గంటల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాల గురించి ఎలాంటి హాట్ హాట్ చర్చలు వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల తాలూకా వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎప్పుడూ కూడా చాలా బోల్డ్ గా డేరుగా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈసారి తన ఫ్యామిలీ గురించి మాట్లాడిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. ప్రజల కోసం పాతిక సంవత్సరాలు కష్టపడతానని పార్టీ పెట్టినప్పుడే చెప్పాను అని.. ఆ మాట ప్రకారమే నిలబడతాను అని మాట ఇచ్చాడు పవన్ కళ్యాణ్ .

అంతేకాదు దీనికోసం తన ఫ్యామిలీకి సైతం దూరమయ్యాను అని ..బిడ్డల ఆలనా పాలన చూడలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు . ఓ ఇంటర్వ్యూలో తన బిడ్డల భవిష్యత్తు గురించి ప్రశ్నలు అడగగా ..”అసలు నేను వాళ్లను పట్టించుకోనే లేదు అని ..నా పూర్తి జీవితం రాజకీయాలకు అంకితం అని ప్రజాసేవనే చేస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చారు”. “అలాగే తన తండ్రి తనకి ఆస్తిపాస్తులు ఇవ్వలేదని ..కేవలం చదువుకోమని మాత్రమే చెప్పారు అని .. ధర్మం వైపు నిలబడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని చెప్పారు అని .. తండ్రి మాట ప్రకారమే నడుచుకుంటున్నట్లు పేర్కొన్నారు “.

అంతేకాదు తన భార్య విదేశీరాలని ..ఈ దేశ రాజకీయాల ప్రాసెస్ పై రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదు అని ..ఎందుకు ఎప్పుడూ ఇంట్లో అలా ఉంటావు అని అడిగేదని ..చాలా భయపడిందని రాజకీయాలలో ఎలా ఉంటుందో తనకి అస్సలు అవగాహన లేదు అని.. నా కారణంగా కొందరు తనని కూడా దూషించారు అని ..దానికి నేను ఆమె ను క్షమించమని కూడా అడిగానని ఎమోషనల్ అయ్యారు .

అంతేకాదు “అసలు నీకు ఈ రాజకీయాలు ఎందుకు..? సైలెంట్ గా సినిమాలు చేసుకోవచ్చుగా అని ..తన భార్య తనని అడిగిందని ..అందుకు సమాధానంగా ధైర్యం కోల్పోయిన పోయిన ఎంతోమంది బిడ్డలకు అండగా ఉన్నాను అని ..13వ తేదీ పిఠాపురం కి రా అక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో చూడు నేను ఎందుకు ఇంత కష్టపడ్డానో.. ఎందుకు రాజకీయాల్లో నిలబడ్డాను నీకే అర్థమవుతుంది” అంటూ తన భార్యకు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు . దీంతో సోషల్ మీడియాలో ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద ధుమారాన్ని రేపుతున్నాయి..!!