ప్రియుడితో కలిసి తమన్నా షాకింగ్ డెసిషన్.. పెళ్లికి ముందే తల్లి కానున్న మిల్కీ బ్యూటీ..?!

ప్రతి ఏడాది సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా మారాలని.. హీరో, హీరోయిన్లుగా రాణించాలంటూ ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. అయితే ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత.. సార్డం తెచ్చుకోవాలంటే ఆరు సంవత్సరాల శ్రమించాల్సి ఉంటుంది. దీంతో పాటు పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక హీరోయిన్ల విషయంలో అది మరీ రేర్ గా జరుగుతోంది. స్టార్ హీరోయిన్గా ఎంత క్రేజ్ తెచ్చుకున్నా.. ఒక్క సినిమా ఫ్లాప్ అయింది అంటే వారి లైమ్ లైట్‌లో కనిపించకుండా మాయమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది మిల్కీ బ్యూటీ తమన్న.

Vijay Varma On His Relationship With Tamannaah Bhatia: 'There's A Lot Of  Love' | People News | Zee News

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన ఈ అమ్మడు ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా నటనతో సత్తా చాటుకుని హీరోయిన్గా దూసుకుపోతుంది. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ రాణిస్తున్న తమన్న గత ఏడాది లాస్ట్ స్టోరీస్ 2, జి కర్ధ‌ లాంటి బోల్డ్ సిరీస్‌లో మొహమాటం లేకుండా ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ.. విజయవర్మతో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ల‌స్ట్‌ స్టోరీస్ 2 షూటింగ్ టైంలో వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. మొదట్లో తమ ఎఫైర్ రూమర్స్ అంటూ ఇద్దరు ఖండించినా.. తర్వాత దానిపై క్లారిటీ ఇచ్చారు. వారిద్దరు లవ్ లో ఉన్నామంటూ వివరించారు. ఇక ఓపెన్ అయిన తర్వాత మరింతగా చటాపటాలు వేసుకొని తిరుగుతున్నారు. ఏకాంతంగా విహారయాత్రలకు చెక్కేస్తున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు అంటూ వార్తలు వైరలైన సంగతి తెలిసిందే.

Watch: Vijay Varma, Tamannaah Bhatia turn heads at Randeep Hooda and Lin  Laishram's reception - India Today

ఈ క్రమంలో మరో షాకింగ్ న్యూస్ నెటింట‌ చెక్కర్లు కొడుతుంది. పెళ్లికి ముందే తల్లి కావాలని తమన్నా నిర్ణయించుకుందట. ముందే బాయ్ ఫ్రెండ్ తో అగ్రిమెంట్ కుదుర్చుకుందట. ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నాక ఓ బిడ్డ పుట్టి వారి బాధ్యతలు పట్ల మరింత స్పష్టత వచ్చిన తరువాత ఇద్ద‌రు వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అందుకే బిడ్డ పుట్టిన కొన్నాళ్లకు పెళ్లి చేసుకుంటే తన బంధం మరింత స్ట్రాంగ్ అవుతుందని వారు భావిస్తున్నారట. ఈ క్రమంలో తమన్న పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అవ్వనుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీ వారిలో ఈ కల్చర్ ఎక్కువైంది. అలా పెళ్లికి ముందే ఆలియా ప్రెగ్నెంట్ అయిన సంగతి తెలిసిందే. ఇలియానా కూడా లివింగ్ రిలేషన్షిప్ చేసి తల్లి అయిన తరువాత భర్త ఎవరో రివిల్ చేసింది. ఇప్పుడు తమన్నా కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.