విడాకుల తరువాత ఆ పనికి అలవాటు పడిన స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ షాక్..!

జనరల్ గా మనకు బాధ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం ..బాగా ఏడ్చేస్తాం ..అయ్యయ్యో ఈ జీవితం ఏంటి ఇలా అయిపోయింది అంటూ నెత్తి నోరు మొత్తుకుంటాము. ఇలా జరగకుండా ఉంటే బాగుండు అని ఆశపడతాము.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలో ప్రయోజనం లేదు. కొంతమంది పూర్తి డిప్రెషన్ కి లోనైపోయి చెడు వ్యసనాలకు అలవాటు పడతారు . తాజాగా అలాంటి ఒక విషయం స్టార్ హీరోయిన్ కి సంబంధించి బయటపడింది. ఆమె మరి ఎవరో కాదు స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా . అమ్మడు పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తన అంద చందాలతో ఇండస్ట్రీని ఏలేసిన ఓ అందాల ముద్దుగుమ్మ .

అందం – అభినయం ఆమె సొంతం . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది మనీషా కోయిరాలా అంటే ఆమె ఎంత క్రేజ్ కల హీరోయిన్ అనే విషయం అర్థం చేసుకోవచ్చు . ఆమె నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్స్ వద్ద సందడి వాతావరణం ఎలా ఉంటుంది అనేది సపరేట్ కి చెప్పక్కర్లేదు. కాగా తాజాగా ఒక విషయాన్ని బయట పెట్టింది మనిషా కొయిరాలా .

మనీషా కొయిరాలా 2010లో సామ్రాట్ దహలతో పెళ్లి చేసుకున్నింది. ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది. అంతేకాదు తన భర్త టార్చర్ ను భరించలేక విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . అంతేనా ఆ టైంలో ఆమె చాలా మానసికంగా కృంగిపోయిందట. తాగుడుకు కూడా బానిసైపోయిందట . డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట . ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడిందట , ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడటం తర్వాత ఆమె మళ్ళీ ఆరోగ్యం కుదుటపడడంతో చాలా చాలా జాగ్రత్తగా హెల్తును కాపాడుకుంటూ వస్తుందట .చాలా రోజుల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నటి తాజాగా :హీరా మండి” అనే వెబ్ సిరీస్ ద్వారా మళ్ళీ ప్రేక్షకులను పలకరించింది..!!