మరికొద్ది గంటల్లో ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు స్టార్ట్.. ప్రభాస్ “కల్కి” నిర్మాత సంచలన పోస్ట్ వైరల్..!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. అది ఏ రంగమైన సరే .. బయట చిన్న షాప్స్ దగ్గర నుంచి పెద్దపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేసే ఎంప్లాయిస్ వరకు .. సినిమా ఇండస్ట్రీలో పలు స్టార్ హీరోస్ – హీరోయిన్స్ – డైరెక్టర్స్ – ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏపీలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలపై రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి ..చర్చించుకుంటున్నారు.. మాట్లాడుకుంటున్నారు .

ఇలాంటి క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ నటిస్తున్న “కల్కి ఏడి 2898”.. సినిమా ప్రొడ్యూసర్స్ ..ఏపీ ఎన్నికలకు సంబంధించి చేసిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే .. నిజానికి మే 9వ తేదీ ఈ సినిమా రిలీజ్ అవ్వాలి . కానీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సినిమా జూన్ 27 పోస్టుపోనైంది . కాగా ఈ క్రమంలోనే నిర్మాత స్వప్న దత్.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది .

నాగ్ అశ్వీన తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ..” కల్కి సినిమాకు సీజ్ వర్క్ చేసేవారు అందరూ కూడా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిపోయారు అని నాగ్ అశ్వీన్ అంటాడు”..అప్పుడు స్వప్న.. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నావ్..? అని అడుగుతుంది .దీనికి నాగ్ అశ్వీన్ ఎవరు గెలిచినా నాకు అనవసరం ..కానీ నా సీజ్ షాట్స్ ఎప్పుడు వస్తాయో ..?అదే నాకు కావాలి అంటాడు ..ఇదంతా స్వప్న పోస్టులో వివరించడంతో అది కాస్త వైరల్ గా మారింది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే పోస్ట్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!