స్నేహ‌రెడ్డికు ఏకంగా రూ. 2.5కోట్లతో గిఫ్ట్ ఇచ్చిన బ‌న్నీ.. ఇంత‌కీ ఆ గిఫ్ట్ ఏంటంటే..?!

ఐకాన్ సార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా ఎలాంటి సినిమాల్లో నటించకపోయినా.. ఓ మీడియం రేంజ్ హీరోయిన్కు ఉండే పాపులారిటీని దక్కించుకుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలు తో పాటు ఫోటోషూట్లను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ.. అభిమానులను మెప్పిస్తుంది స్నేహ రెడ్డి. ఇక అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డిపై ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు పలు సందర్భాల్లో వ్యక్తపరుస్తూనే ఉంటాడు. గతంలో ఇద్దరమ్మాయిలతో ఈవెంట్లో.. ఇద్దరు హీరోయిన్లు ఉంటే వాళ్లలో ఈ ఫేవరెట్ ఎవరూ అని అడగగా.. ఇద్దరు రెండు కలలాంటివారు అంటూ వివరించడం.. మరి మీ భార్య ఏంటి సార్ అని డైరెక్టర్ అడిగితే.. ఆమె నా హార్ట్.. హార్ట్‌ లేకపోతే జీవితమే ఉండదు. స్నేహ రెడ్డి లేకపోతే బన్నీ లైఫ్ లేదు అంటూ వివరించాడు.

Do You Know Allu Arjun's Wife Sneha Reddy Is A Working Woman? Allu Aravind Reveals Interesting Information! - Filmibeat

అలాగే ఇటీవల ఆర్య 20 వేడుకల్లో కూడా స్నేహ రెడ్డితో తనది వన్ సైడ్ లవ్ అంటూ.. తన ప్రేమను చూపించడమే కానీ స్నేహ రెడ్డి నుంచి ఎటువంటి ప్రేమ రాదంటూ.. ఫన్నీగా వివరించిన సంగతి తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు భార్యపై బ‌న్నీ తన ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంటాడు. తాజాగా ఈమెకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి భార్యపై ఉన్న ప్రేమను వివరించాడట‌. విలువగల గిఫ్ట్ ఇచ్చి స్నేహా రెడ్డికి సర్ప్రైజ్ చేశాడట బన్నీ. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారా.. లేటెస్ట్ మోడల్ bmw కార్ ని.. బన్నీ స్నేహ రెడ్డికి గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలుస్తుంది. గతంలో ఈ కారుని బన్నీ షో రూమ్ కు వెళ్లి బుక్ చేసిన ఫొటోస్ నెట్టింట వైర‌ల్ అయినా సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ కారు ఇంటికి తీసుకువచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటున్న వీడియో తెగ వైరల్ గా మారింది.

అయితే ఈ కాస్ట్లీ కారును భార్య కోసమే బన్నీ గిఫ్ట్ చేశాడంటూ తెలుస్తుంది. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. భార్య కోసం ఏకంగా రెండున్నర కోట్ల విలువైన బిఎండబ్ల్యూ కార్ తో సర్‌ప్రైజ్‌ చేశాడంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాయి. ఇక ఫస్ట్ సింగిల్ అయితే ఇప్పటికీ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరిగింది. ఈ సినిమాతో బన్నీ నార్త్ లోను మరోసారి తన మార్కెట్ పెంచుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు.