త్వరలోనే గుడ్ న్యూస్..ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాలలో వైరల్ గా మారింది . ప్రదీప్ మాచిరాజు ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఫిమేల్ యాంకర్లు ఇండస్ట్రీని ఏలేస్తున్న క్రమంలో మేల్ యాంకర్ గా వచ్చి తనదైన స్టైల్ లో ఇండస్ట్రీని షేక్ చేశాడు . ఒకానొక టైంలో యాంకర్ సుమని సైతం వెనక్కి నెట్టాడు ప్రదీప్ మాచిరాజు అనడంలో సందేహం లేదు .

కాగా ఈ మధ్యకాలంలో ప్రదీప్ యాంకరింగ్ కి దూరమయ్యారు. అంతేకాదు బాడీ ఫిజిక్ పై కాన్సన్ట్రేషన్ చేశారు. దానికి సంబంధించిన పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. రీసెంట్గా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకున్నారు . మరి ముఖ్యంగా ఈ ఫొటోస్ లో బ్యాక్ సైడ్ నుంచి చూస్తూ ఉంటే ఇతడు ప్రదీప్ కాదు అల్లు అర్జున్ అనే విధంగా ఉన్నాడు .

అంతలా తన బాడీని మార్చేసుకున్నాడు . అయితే ప్రదీప్ ఈ రేంజ్ లో మారిపోవడానికి కారణం కొత్త సినిమా అంటూ తెలుస్తుంది. త్వరలోనే ప్రదీప్ మాచిరాజు గుడ్ న్యూస్ తో రాబోతున్నాడట .బడా ప్రొడక్షన్ హౌస్ తో బడా డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడట . అందుకోసమే ఈ హెయిర్ స్టైల్ ..బాడీ బిల్డింగ్..చేసే పనిలో బిజీ అయ్యారట. దీంతో సోషల్ మీడియాలో ప్రదీప్ మాచిరాజుకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ వైరల్ గా మారాయి..!!