బిగ్ బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసిన ప్రభాస్.. సెన్సేషనల్ (వీడియో) వైరల్..!

వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాదిమంది రెబెల్ ఫాన్స్ వెయిట్ చేస్తున్న వీడియో రిలీజ్ అయిపోయింది .మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అన్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా వీడియోల రూపంలో మేము పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నామంటూ వీడియోస్ రిలీజ్ చేశారు . ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి హీరోలు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం.

అయితే నిన్న మొన్నటి వరకు రామ్ చరణ్ – ప్రభాస్ – ఎన్టీఆర్ .. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయలేదు అంటూ నానా రాద్ధాంతం చేశారు, ఫైనల్లీ అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేశారు, రామ్ చరణ్ ఏకంగా పిఠాపురం ప్రచారానికి వచ్చేసాడు . ఇక ప్రభాస్ – ఎన్టీఆర్ ల పై అందరి కన్ను పడింది. తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి వీడియో వైరల్ గా మారింది .

అందులో ఆమె మాట్లాడుతూ..”పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో మా పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం ..అది ఎవరు ఆపలేరు .. చాలామంది ఇప్పుడే అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ మెజారిటీతో ఘన విజయం సాధిస్తాడు .. పిఠాపురం ప్రజలందరూ కూడా ఎంత మెజారిటీ ఇస్తారో అది రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజారిటీ అవుతుంది అంటూ ఆశిస్తున్నాను. జై మోడీ జై తెలుగుదేశం జై జనసేన “అంటూ చెప్పుకొచ్చింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది .

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ కృష్ణంరాజు గారు శ్యామలాదేవి గారు ఏది చెప్తే నాది అదే రూటు అని ..వాళ్ళ మాటే నా మాట అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రభాస్ పెద్దమ్మ జనసేనకు సపోర్ట్ చేస్తుంది అంటే కచ్చితంగా ప్రభాస్ కూడా జనసేనకు సపోర్ట్ చేసినట్లుగా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కే ఓటు వేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Trend PSPK (@trend_pspk)