ఏపీ ఎన్నికల్లో మహేశ్ బాబు ఇన్వాల్వ్ మెంట్.. లాస్ట్ మినిట్ లో షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చాడుగా..!

వచ్చేసింది ..టైం దగ్గర పడిపోయింది.. ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కేవలం మరికొద్ది గంటలు అంటే .. మరి కొద్ది గంటల్లోనే స్టార్ట్ కాబోతున్నాయి. ప్రతి ఒక్క రాజకీయ నేత తమకు వచ్చిన విధంగా ప్రజలను ఆకట్టుకోవడానికి చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని పార్టీలు అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ ని కూడా రంగంలోకి దించుతున్నారు. ఇదే మూమెంట్లో ఏపీ ఎన్నికలకు చాలా చాలా దూరంగా ఉన్న స్టార్ హీరో మహేష్ బాబు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయారు .

ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా పాల్గొనడం విశేషం . రీసెంట్గా కొంతమంది రాజకీయ నేతలు మహేష్ బాబు నటించిన సినిమాలోని డైలాగ్స్ కూడా వీడియోల రూపంలో నెట్టింట దుమ్ము రేపుతున్నాయి. ప్రచారంలో ఇంటర్వ్యూలలో నాయకులు మహేష్ బాబు డైలాగ్స్ వాడేస్తున్నారు. రీసెంట్గా టిడిపి అభ్యర్థిగా బరిలోకి వచ్చిన చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా మహేష్ బాబు బిజినెస్ మాన్ డైలాగ్ రిలేటెడ్ గా చెప్పారు .

“నేను ఊరికే రాలేదు జండా పాతడానికే వచ్చాను “అంటూ యాంకర్ అనగా ..”ఆయన అవును అన్నట్లుగానే నవ్వుతారు”. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు చాలామంది రాజకీయ నేతలు మహేష్ బాబు సినిమాలోని డైలాగ్స్ వాడుతూ తమదైన స్టైల్ లో మహేష్ బాబు నీ పరోక్షకంగా ఏపీ రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే మహేష్ బాబు మాత్రం ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా ఉండడం గమనార్హం..!!