ప్రజెంట్ ఏపీలో ఎన్నికల హడావిడి ఎలా కొనసాగుతుందో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఉండడం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది . అంతేకాదు మెగా ఫ్యామిలీ మొత్తం ఆయన కోసం ప్రచారానికి పిఠాపురం కదిలి వస్తున్నారు. ఇప్పటికే ఆయన బ్రదర్ నాగబాబు ..నాగబాబు భార్య ..నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ..సాయి ధరంతేజ్ తమదైన స్టైల్ లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ప్రచారం చేశారు . అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సైతం పిఠాపురం వాస్తవ్యులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు . వీడియో రూపంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలి అని అభ్యర్థించారు .
అంతేకాదు పవన్ కళ్యాణ్ గెలవడం ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు చాలా చాలా అవసరమని ..నా తమ్ముడు జనాలకు సేవ చేస్తాడు అని హామీ కూడా ఇచ్చారు . అయితే మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం ప్రచారానికి వస్తాడు అంటూ చాలామంది జనాలు ఆశపడ్డారు. లాస్ట్ మినిట్ లో అది క్యాన్సిల్ అయింది. కానీ ఎవ్వరు ఊహించిన విధంగా లాస్ట్ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అలాగే కొడుకు రామ్ చరణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం లో ప్రచారం చేయడానికి ముందుకు వచ్చారు . నేడు ఎన్నికల ప్రచారం చివరి రోజున రామ్ చరణ్ – సురేఖ పిఠాపురం చేరుకున్నారు . వాళ్లతో పాటు మావయ్య అల్లు అరవింద్ కూడా పిఠాపురం కుకుటేశ్వర ఆలయాన్ని సందర్శించుకున్నారు .
కాగా ఈ క్రమంలోనే ఏయిర్ పోర్ట్ లో రాంచరణ్ ..విజువల్స్ ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ గా మారాయి . ఆ విజువల్స్ లో కనిపించిన రాంచరణ్ గతంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన రథం వారాహి కలర్ పై అభ్యంతరం తెలుపుతూ వైసిపి నాయకులు పెద్ద పెద్ద గొడవ చేసిన సంగతి తెలిసిందే . అయితే ఇప్పుడు రామ్ చరణ్ దానికి కౌంటర్ ఇస్తూ టాప్ టు బాటమ్ సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. ఆఖరికి కాళ్లకు వేసుకున్న షూస్ కూడా అదే రంగుని వాడడం జనసైనికులు అట్రాక్ట్ చేస్తుంది . దీంతో పవన్ కళ్యాణ్ గతంలో షేర్ చేసిన ఒక షార్ట్ పోస్ట్ ని ఇప్పుడు చరణ్ ఫోటోలను కలిపి ట్రెండ్ చేస్తున్నారు జనసైనికులు . ఒకే ఒక్క దెబ్బతో అందరికీ చేయాలి అంటే అబ్బాయిని దాటుకొని వెళ్లాల్సిందే అంటూ సరికొత్త డైలాగ్స్ తో ట్రై చేస్తున్నారు..!!