ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే అన్ని పార్టీల నుంచి రాజకీయాల వేడి ఒక లెవెల్ లో ఉంటే.. జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎన్నికల వేడి వేరే లెవెల్‌లో ఉంది. పవర్ స్టార్ ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో సక్సెస్ సాధించాలని.. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో ఎంతో కసిగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే పిఠాపురంలో ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే పవన్ కు సపోర్ట్ గా టాలీవుడ్ లో చాలామంది స్టార్ నటినటులు అండగా నిలిచారు.
జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు మెగా హీరో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా పిఠాపురంలో ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలంటే వఙప్తి చేశారు. ఇక చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తమ సపోర్టు పవన్ కళ్యాణ్ గారికి అందించి ఆయనను గెలిపించమంటూ కోరుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు నాని, తేజసజ్జ ఇలా ఎంతోమంది యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ కు మా సపోర్ట్ అందిస్తున్నామంటూ తమ మద్దతు తెలియజేశారు. ఇక తాజాగా టాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్స్ కూడా తమ మద్దతు పవన్ కళ్యాణ్‌కు ఉందంటూ ప్రూవ్ చేసుకుంటున్నారు.
ఇటీవల టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీలా.. పవన్ కళ్యాణ్ కు తన మద్దతు తెలియజేస్తూ ఓ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రభాస్ సలార్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుని.. భారీ పాపులారిటి దక్కించుకున్న శ్రేయ రెడ్డి.. పవన్ కళ్యాణ్ కు తన మద్దతును తెలియజేసింది. పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీతో సక్సెస్ అందాలన్నీ.. దేవుడి ఆశీస్సులు ఆయనపై ఉండాలంటూ వివరించింది. గాజు గ్లాస్ కు ఓటేయండి అంటూ అభ్యర్థించింది. ప్రస్తుతం శ్రేయ రెడ్డి చేసిన పోస్ట్ నెటింట తెగ వైరల్ అవుతుంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు చాలామంది ఆడియన్స్ శ్రీయ రెడ్డి కి ఫిదా అవుతున్నారు.
Wishing you great luck #Pawanakalyan garu for a successful election in pithapuram ! May you be blessed with abundance always . #VoteForGlass pic.twitter.com/5scPQrThuT
— Sriya Reddy (@sriyareddy) May 10, 2024