‘ జబర్దస్త్ ‘ రాజకీయాలను బయటపెట్టిన ముక్కు అవినాష్.. కమెడియన్స్ కు వచ్చే రెమ్యునరేషన్ ఇంతే అంటూ..?!

తెలుగు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా చిన్న కంటెస్టెంట్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి స్టార్ కమెడియన్గా క్రేజ్ సంపాదించుకున్న వారిలో ముక్కు అవినాష్ ఒక‌డు. మొదట కంటిస్టెంట్ గా జ‌వ‌ర్ధ‌స్త్‌కు వ‌చ్చిన‌ ఆయన తర్వాత టీం లీడర్ గా ఏదిగి ఏళ్ల తరబడి జబర్దస్త్ లో పనిచేశాడు. 2020లో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అవినాష్‌.. తాజాగా జబర్దస్త్ రాజకీయాలకు రిమానరేషన్కు సంబంధించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ లో రాజకీయాలు ఉంటాయని నేను ఒప్పుకుంటా అంటూ త‌న అనుభ‌వాని వివ‌రించాడు. ఆయ‌న మాట్లాడుతూ రాజకీయాలు ఉన్నా అవి నా దగ్గర చెల్లేవి కాదని.. ఎవరైనా ఏదైనా ఆశించి వస్తే.. నాకు తెలిసిపోయేద‌ని ఆయ‌న విరించాడు.

Avinash: ఈ టైంలో ఇలా అవుతుందనుకోలేదంటూ అవినాష్ వీడియో.. ఏకీపారేస్తున్న  నెటిజన్స్

నా దగ్గర నాంచొద్దు.. అసలు మ్యాటర్ ఏంటి అని అడిగేసే వాడినని.. దాంతో వాళ్ళ రాజకీయాలు నా దగ్గర పనిచేయలేదు అంటూ వివరించాడు. అలాగే జబర్దస్త్ టీం లీడర్స్, డైరెక్టర్లతో కూడా నాకు మంచి సాహిత్యం ఉండేదని.. ఏదైనా నేను వారితో ఫ్రీగా మాట్లాడేసే వాడిని.. అందుకే నేను అక్కడ నెగ్గుకు రాగలిగాను అంటూ వివరించాడు. అయితే 2020లో బిగ్‌బాస్ అవ‌కాశం రావ‌డంతో నేను జ‌వ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని. ఆ టూంలో అగ్రిమెంట్ బ్రేక్ చేసినందుకు నాతో 10 ల‌క్ష‌లు క‌ట్టించుకున్నారు అంటూ వివ‌రాంచాడు.

Bigg Boss 4 Telugu: Jabardasth Avinash had suicidal thoughts!

అయితే జబర్దస్త్ రెమ్యునరరేషన్ మాత్రం తక్కువగానే వచ్చేది.. టీం లో ఉన్న కంటిస్టేంట్స్‌కు పని చేసినందుకు పేకెంట్ ఇచ్చిన‌ తర్వాత టీం లీడర్ గా నాకు వారానికి రూ.7 నుంచి 8 వేలు మాత్రమే మిగిలే అంటూ వివరించాడు. అయితే జబర్దస్త్ ఫేమ్ ద్వారా వచ్చిన ఈవెంట్లతో మాకు డబ్బులు బాగా వచ్చేవని.. జబర్దస్త్ ద్వారా తక్కువ రెమ్యునరేషన్ వచ్చినా.. దాని వల్ల వచ్చే ఈవెంట్లతో మాకు ఎక్కువ సంపాదన వచ్చిందంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అవినాష్ జబర్దస్త్ లో రాజకీయాల ఉంటాయంటూ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.