గీత గోవిందం లో విజయ్ చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. మరి ఇంతలా మారిపోయింది ఏంటి..?!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొద‌ట‌ చిన్న చిన్న పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే హీరోగా అవకాశాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం హిట్‌లు, ఫ్లాపుల‌తో సంభందం లేకుండా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే .పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమై.. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి తో బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని యూత్ కు మరింత దగ్గర అయ్యాడు. తర్వాత డైరెక్టర్ పరశురాం డైరెక్షన్‌లో గీతగోవిందం సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.

ఇందులో నేషనల్ క్రష్‌ రేష్మిక మందన హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణన్‌, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో మెప్పించిన ఈ సినిమా మ్యూజికల్ గాను మంచి సక్సెస్ అందుకుంది. ఇక‌ ఈ మూవీలో విజయ్ చెల్లెలుగా నటించిన అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాతో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించింది రష్మిక. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి.. ఇప్పుడు ఏం చేస్తుందో.. అన్న విషయాలను ఒకసారి తెలుసుకుందాం. గీత గోవిందం లో విజయ్ చెల్లెలుగా నటించిన ఆ బ్యూటీ పేరు మౌర్యని. ఈ కన్నడ సోయగం విజయ్ దేవరకొండ తో కలిసి గీతగోవిందం సినిమాలో నటించింది.

Mouryani : Biography, Age, Movies, Family, Photos, Latest News - Filmy Focus

ఈ సినిమాలో విజయ్ చెల్లెలుగా నటించిన ఈ అమ్మడు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఇంటర్ చదువుతున్న టైం లోనే సినిమా అవకాశం రావడంతో చిన్న వయసులోనే ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. 2017లో అర్ధనారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇందులో మౌర్యని నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. తెలుగులో అల్లరి నరేష్ నటించిన ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో సెకండ్ హీరోయిన్గా ఆకట్టుకుంది. ఇందులో దయ్యం పాత్రలో అద్భుతంగా మెప్పించింది. ఇవే కాకుండా తెలుగులో నెల్లూరు పెద్దరెడ్డి, గీత గోవిందం, జానకి రాముడు, విజయ్ ప్రేమ కథ, సుందరాంగుడు, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఇలా ఎన్నో సినిమాల్లో మెప్పించింది.

ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದ ವೃದ್ಧಾಶ್ರಮದಲ್ಲಿ ಗೀತಗೋವಿಂದಂ ನಟಿ ಜನ್ಮದಿನಾಚರಣೆ |  actress-mouryaani-celebrated-birthday-at-old-age-home-Chikkaballapur

అయితే విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందంతో మౌర్యానికి మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే తెలుగు సినిమాల్లో ఇప్పటికీ మౌర్యాన్ని నటిస్తూంది. తెలుగులో ఆమె చివరిగా నేడే విడుదల సినిమాలో కనిపించి మెప్పించింది. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దీంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి. అయితే సినిమాల్లో కనిపించకపోయిన సోషల్ మీడియాలో సందడి చేస్తూ.. ఫోటోషూట్, రీల్స్ చేస్తూ ఇంకా తాను లైమ్ లైట్‌లోనే ఉన్నానని నిరూపించుకుంటుంది. తాజాగా ఆమె ఫొటోస్లో త‌న మార్పు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతారు. ఇప్పటికీ ఆమె గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే ట్రెడిషనల్ లుక్ లోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.