తారక్ కోసం బిగ్ శాక్రిఫైజ్ చేసిన కీరవాణి.. దట్ ఈజ్ రియల్ ఫ్రెండ్షిప్..!

జూనియర్ ఎన్టీఆర్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో.. టాప్ మోస్ట్ హీరో ..పాన్ ఇండియా హీరో .. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి నిజాయితీ గల హీరో .. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో.. తారక్ గురించి ఇంకా ఇంకా చెప్పాలి అనిపిస్తుంది. వినే వాళ్లకి ఇంకా బాగా చెప్తే బాగుండు అనిపిస్తుంది . అలాంటి ఒక క్రేజీ రికార్డ్స్ సృష్టించుకున్న మనిషి . ప్రజెంట్ బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు .

రీసెంట్గా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ ను బయట పెట్టేసాడు కీరవాణి. ఎన్టీఆర్ కీరవాణి ఎంత మంచి ఫ్రెండ్స్ అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . కీరవాణి పాడిన అన్ని పాటలలోకి జనాలకి మోస్ట్ ఫేవరెట్ గా ఉండే సాంగ్ “రాలిపోయే పువ్వా నీకు”..అయితే ఈ పాట ఎన్టీఆర్ కి కూడా చాలా ఇష్టమట. అది తెలుసుకున్న కీరవాణి ఎన్టీఆర్ బర్త డే సందర్భంగా స్వయంగా పాట పాడి రికార్డ్ చేసి క్యాసెట్ పంపించారట .

మెస్మరైజ్ అయిపోయిన ఎన్టీఆర్ ..”దయచేసి ఈ పాట ఎక్కడ కూడా పాడకండి ..నా కోసం ఈ ఒక్క పని చేయండి ..మీరు పాడిన ఈ పాట నాకు ఎంతో నచ్చింది ..నా బాధల్లో ఉన్నప్పుడు నా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పాటే నన్ను నేనున్నాను అంటూ నాకు సపోర్టుగా నిలిచింది “అంటూ ప్రామిస్ చేయించుకున్నాడట . ఇప్పటివరకు ఎన్టీఆర్ కి ఇచ్చిన ప్రామిస్ ను బ్రేక్ చేయలేదు కీరవాణి. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది…!